Begin typing your search above and press return to search.

అల్లుడు అతిగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే క‌మ‌ర్షియ‌ల్

By:  Tupaki Desk   |   17 Jan 2021 3:53 AM GMT
అల్లుడు అతిగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే క‌మ‌ర్షియ‌ల్
X
టాలీవుడ్ లో కొన్ని మాస్ ఎంట‌ర్ టైనర్లలో.. ఓవ‌రాక్ష‌న్ డూప్ స‌న్నివేశాల‌పై జ‌నంలో విస్త్ర‌తమైన చ‌ర్చ‌ సాగింది. కంటి చూపుతో ట్రైన్ వెన‌క్కి వెళ్లిపోవ‌డం.. తెగి పడిన హెడ్ గాల్లోకి అట్నుంచి చుక్క‌ల్లోకి వెళ్లి తిరిగి రావ‌డం.. ఇలాంటి గొప్ప స‌న్నివేశాల్ని తెర‌పై చూపించిన మ‌హానుభావులున్నారు మ‌నకు.

అయితే ఇలాంటి ఓవ‌రాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కులు న‌వ్వుకుంటే స‌మీక్ష‌కులు దుమ్మెత్తిపోసారు. ఎంత ఊర మాస్ అయినా మ‌రీ ఇంత దారుణంగానా? అని విమ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయి.

కానీ బెల్లంకొండ మాట తీరు చూస్తుంటే .. ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు అతితోనే వాణిజ్య ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌ఫ‌లం అవ్వ‌డానికి ఆస్కారం ఉంద‌ని భావించాల్సి ఉంటుంది. త‌న‌యుడు బెల్లంకొండ శ్రీ‌ను న‌టించిన అల్లుడు అదుర్స్ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని కాస్త అతిగానే చూపించార‌ని అంగీక‌రించిన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ `అతి ప్రవర్త‌న‌`పై కామెంట్ల‌ను ప్ర‌స్థావిస్తూ.. ఏకంగా క్లాసిక్స్ శంకరభరణం- సప్తప‌ది- సాగరసంగమం సినిమాల ప్ర‌స్థావ‌న తెచ్చారు. తాము అలాంటి సినిమాను చేయలేదని.. అతిగా పండుగ కమర్షియల్ మూవీ చేసామ‌ని... ఇక్కడ అతిగా ప్రవర్తించడం తప్పనిసరి అని స‌రికొత్త క‌మ‌ర్షియ‌ల్ నిర్వ‌చ‌నం చెప్పారు.

అల్లుడు అదుర్స్.. ఓవ‌రాక్షన్ తో నిండి ఉందని సురేష్ అంగీకరించ‌డ‌మేగాక‌.. ఓవ‌రాక్షన్ ‌తో ఒక సినిమా సూపర్ హిట్ గా మారుతుందని కూడా చెప్పారు. అల్లుడు `అతిగా ప్రవర్తించడం` క‌మ‌ర్షియ‌ల్ అంశ‌మ‌ని అన్నారు. అన్నిటిలోనూ ఆదాయమే ముఖ్యమని సినిమా విజయం అది సేకరించిన డబ్బుతోనే నిర్ణయించబడుతుందని సెల‌విచ్చారు. నిర్మాత.. హీరో ప్రతి ఒక్కరూ తమ సినిమా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారని నిజాల్ని నిక్క‌చ్ఛిగా చెప్పారు.

ఇక ఇదే వేదిక‌పై సోనూసూద్ సేవాగుణాన్ని.. మూవీలో త‌న ఎంట్రీని ఆకాశానికెత్తేశారు కొండ‌. దిల్ రాజును విమర్శించిన నిజాం పంపిణీదారు శ్రీను గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. నిజాంలో వారు లేకుండా పంపిణీ లేనందున దిల్ రాజు లేదా సిరిష్ ని నిందించడానికి శ్రీనుకు హక్కు లేదని సురేష్ అన్నారు. తాను పనిచేసిన సినిమాలకు శ్రీను జీఎస్టీ చెల్లించలేదని అన్నారు. దిల్ రాజు- సిరీస్ ప‌రిశ్ర‌మ‌క‌కు చేస్తున్న సేవ‌ల్ని బెల్లంకొండ కొనియాడారు.