Begin typing your search above and press return to search.
క్యాచీ మాస్ టైటిల్ తో వస్తున్న బెల్లకొండ బాబు
By: Tupaki Desk | 12 March 2020 10:39 AM ISTమాస్ ఎంటర్టైనర్లు చేస్తూ మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సాధించిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోయినేడాది 'రాక్షసుడు' లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో ఓ చక్కని విజయం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. #BSS8 గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నిర్మాతలు ప్రమోషన్స్ ప్రారంబించారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు 'అల్లుడు అదుర్స్' అంటూ ఓ క్యాచీ మాస్ టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో శ్రీనివాస్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని.. గడ్డం కింద చేతిని పెట్టుకుని చిరునవ్వుతో ఏదో ఆసక్తిగా వింటున్నాడు. గోధుమ రంగు చొక్కా ధరించి ఎప్పటిలాగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్.. ఈ పోస్టర్ ఫీల్ చూస్తుంటే బెల్లంకొండ బాబు ఈ సారి మరో కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడనిపిస్తోంది. పోస్టర్ లోనే ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నమని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నభ నటేష్.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. సోను సూద్.. ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు సంగీత దర్శకుడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు.