Begin typing your search above and press return to search.
పుష్ప ఫోకస్ హిందీ తమిళంపైనే?
By: Tupaki Desk | 12 Dec 2021 8:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం -పుష్ప దక్షిణాదితో పాటు ఉత్తరాదినా అత్యంత భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. హిందీ చిత్రసీమలో బన్నీకి ఇది స్ట్రెయిట్ సినిమా తరహా అనే చెప్పాలి. మరోవైపు తమిళంలోనూ బన్ని తన మార్కెట్ రేంజును పెంచుకోవాలన్న కసితో ఈ సినిమా చేశాడు. అతడికి మలయాళ మార్కెట్ పెద్ద ప్లస్ అన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పుష్ప టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ సంచలనంగా మారాయి. పోస్టర్లు వైరల్ గా దూసుకెళ్లాయి. రిలీజ్ కి ఇంకో వారం సమయమే మిగిలి ఉండగా రిగరస్ గా ప్రమోషన్స్ చేసేందుకు పుష్ప టీమ్ ప్రణాళికల్ని సిద్ధం చేసి దూసుకెళుతోంది. టీమ్ అందరికీ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో కేర్ మరీ ఎక్కువగానే ఉందని చెప్పాలి. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబట్టి.. ఈవారం అంతా ఫుల్ బిజీగా ఉంటుంది టీమ్. ఇప్పటికే అల్లు అర్జున్ - రష్మిక ప్రమోషన్స్ ప్రారంభించారు. తెలుగును మించి తమిళం లో ప్రచారం చేయనున్నారు. ఆ మేరకు సామాజిక మాధ్యమాల్లో పుష్ప టీమ్ ప్రమోషన్ గురించి ప్రస్తావించింది.
ఈ ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా విడుదల కానున్నాయట. పుష్పరాజ్ గా బన్ని- శ్రీవల్లిగా రష్మిక నటిస్తుండగా.. సమంత స్పెషల్ సాంగ్ తో ఊపు తెస్తున్న సంగతి తెలిసిందే. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సునీల్ - అనసూయ- ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఓవైపు.. పుష్ప ప్రమోషన్స్ మరోవైపు పాన్ ఇండియా లెవల్లో హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే.