Begin typing your search above and press return to search.

బన్నీ వారసుడు.. స్పెషల్ డే స్పెషల్ ఫొటో!

By:  Tupaki Desk   |   3 April 2023 10:52 AM GMT
బన్నీ వారసుడు.. స్పెషల్ డే స్పెషల్ ఫొటో!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామ లింగయ్య మనవడిగా సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ ఈయనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. 1885లో వచ్చిన విజేత సినిమా ద్వారా బాల నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఆయన మరో 2003లో గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2 సినిమాల్లోనూ నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు.

జులాయి, రేసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అల వైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్న తన కుటుంబం కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తుంటారు బన్నీ. తన భార్య, పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడుపుతుంటారు.

అయితే నేడు బన్నీ కుమారుడు అల్లు అయాన్ 9వ పుట్టిన రోజు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ట్విట్టర్ వేధికగా హ్యాపీ బర్త్ డే అయాన్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. కుమారుడితో పాటు తాను కలిసి దిగిన ఫొటోను పెట్టి.. హ్యాపీ బర్త్ డే టు ద లవ్ ఆఫ్ మై లైప్.. మై స్వీట్ చిన్ని బాబు అంటూ రాసుకొచ్చారు. ఇందులో అయాన్ తో పాటు బన్నీ చాలా స్టైలిష్ గా ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.

అయితే బన్నీ చేసిన ఈ పోస్టు చూసిన ప్రతీ ఒక్కరూ హ్యాపీ బర్త్ డే అయాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నూరేళ్లు చల్లగా ఉండమంటూ దీవిస్తున్నారు. ఫొటో అదిరిపోయిందని కొందరు చెబుతుండగా.. అయాన్ చాలా క్యూట్ గా ఉన్నాడని మరికొంత మంది నెటిజెన్లు అంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కే కాదు.. ఈయన పిల్లలకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆయన కుమార్తె అర్హకు మరింత మంది ఫ్యాన్స్ ఉన్నారు.

బన్నీ, స్నేహ రెడ్డిలకు 2011 మార్చి 6వ తేదీన పెళ్లి జరిగింది. అ తర్వాత మూడేళ్లకు అంటే 2014 ఏప్రిల్ 3వ తేదీన అయాన్ జన్మించాడు. ప్రస్తుతం అయాన్ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ ఏటలోకి అడుగు పెడుతున్నాడు. తండ్రిలాగే కుమారుడు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకొని.. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనమూ కోరుకుందాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.