Begin typing your search above and press return to search.
సీక్రెట్ గా ఇంకొకటి మెయింటైన్ చేస్తున్న బన్నీ....!
By: Tupaki Desk | 24 April 2020 6:30 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా తన హవా చూపిస్తున్నాడు అల్లు అర్జున్. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న టాలీవుడ్ హీరోల్లో బన్నీ ఒకరని చెప్పవచ్చు. ఇప్పటికే ఫేస్ బుక్ లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగియున్న అల్లు అర్జున్ మరో సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో 6.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా ట్విట్టర్ లో 4.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే అల్లు అర్జున్ తన అధికారిక ఇన్‌స్టా అకౌంట్ కాకుండా ఇన్ స్టాగ్రామ్ లో మరో సీక్రెట్ అకౌంట్ మెయిన్ టైన్ చేస్తున్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఇన్ స్టాగ్రామ్ లో @alluarjunonline అనే పేరుతో అకౌంట్ మెయింటైన్ చేస్తున్న బన్నీ @bunny_boy_private అనే ఐడీతో మరో సీక్రెట్ అకౌంట్ నిర్వహిస్తున్నాడు. బన్నీతో సన్నిహితులుగా ఉండే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రెటీలు బన్నీ బాయ్ సీక్రెట్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారట. ఈ మధ్య త్రిష - రానా - బన్నీ వీడియో కాల్ సంభాషణ ద్వారా ఈ విషయం స్పష్టమైంది కూడా. త్రిష వారి వీడియో కాల్ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ అల్లు అర్జున్ సీక్రెట్ ఐడీని కూడా ట్యాగ్ చేసింది. అయితే ఇప్పుడు బన్నీ సీక్రెట్ అకౌంట్ ద్వారా బన్నీకి సంబంధించి కొన్ని విషయాలు బయటకి వచ్చాయి.
బన్నీకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఆయన స్వయంగా తీసిన చిత్రాలను ఇన్స్టా సీక్రెట్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడట. తాను తీసిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇతర సెలెబ్రెటీలకు షేర్ చేస్తుంటాడట. మరి బన్నీ తన ఫోటోగ్రఫీ స్కిల్స్ తన అభిమానులకు ఎప్పుడు చూపిస్తాడో. అయితే వాస్తవానికి అల్లు అర్జున్ మాత్రమే కాకుండా చాలామంది స్టార్ సెలబ్రేటీలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫ్యాన్స్ కోసం ఒక అకౌంట్.. తన పర్సనల్ గా మరో సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంటారట. ఇక సినిమా విషయాలకొస్తే ఈ ఏడాది ఆరంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అదే ఊపులో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' సినిమా పట్టాలెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ - మలయాళ, - కన్నడ - హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుక్కు ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్ లో 'ఐకాన్ - కనిపించడం లేదు' అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు.