Begin typing your search above and press return to search.

బ‌న్నీ- స్నేహ‌లు వెకేష‌న్ వీడియో

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:30 AM GMT
బ‌న్నీ- స్నేహ‌లు వెకేష‌న్  వీడియో
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇన్ స్టా..ట్విట‌ర్..ఎఫ్ బీల్లో స్నేహను పాలో అయ్యేవారు ఉన్నారు. ఇక ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ లో అయితే ఆమె రికార్డే సృష్టించారు. ఆ మ‌ధ్య ఈ విష‌యాన్ని స్నేహ స్వ‌యంగా వెల్ల‌డిండి సంతోష ప‌డ్డారు. ఇంట్లో చోటుచేసుకున్న ప్ర‌తీ స‌ర‌దా స‌న్నివేశాన్ని..పిల్ల‌ల‌తో బ‌న్నీ గ‌డిపే క్ష‌ణాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు చేర వేడ‌యంలో స్నేహ ముందుంటారు. సినిమా విశేషాలు పెద్ద‌గా పంచుకోరు గానీ ఫ్యామిలీ విష‌యాల్నే ఎక్కువ‌గా షేర్ చేస్తుంటారు. తాజాగా బ‌న్నీ- స్నేహ‌లు వెకేష‌న్ కి వెళ్లిన ఓ వీడియోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది ఈ జంట‌.

బన్నీ-స్నేహ ఇద్ద‌రు మాల్దీవులు ట్రిప్ వేసారు. ఇద్ద‌రు మాల్దీవుల స‌ముద్రంలో బోటు లో షికారుకు వెళ్లిన ఓ వీడియోను షూర్ చేసారు. బ‌న్నీ స‌తీమ‌ణితో స‌ర‌దాగా గ‌డుపుతోన్న‌మూవ్ మెంట్స్ ని అభిమానుల‌తో పంచుకున్నారు. అయితే ఈ ట్రిప్ లో పిల్ల‌లు ఇద్ద‌ర్ని భార్యాభ‌ర్త‌లు దూరం ఉంచిన‌ట్లు తెలుస్తోంది. పిల్లలు ఇద్ద‌రు ఆయాన్..ఆర్హ‌ల్ని తాత‌య్య నాయ‌న‌మ్మ‌ల ద‌గ్గ‌ర విడిచిపెట్టి ఇద్ద‌రు చిలౌట్ అవ్వ‌డానికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బ‌న్నీ-స్నేహ ఫాలోవ‌ర్స్ బ్యూటీఫుల్ క‌పుల్స్ అంటూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ఇది తెర‌కెక్కుతోంది. తొలి భాగాన్ని `పుష్ప ది రైజింగ్` గా వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అటుపై రెండ‌వ భాగం రిలీజ్ కూడా పెద్ద‌గా ఆల‌స్యం చేయ‌కుండానే రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. షూటింగ్ కూడా ఏ క‌ధాటిగానే జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే మొద‌టి భాగం షూటింగ్ పూర్త‌వ్వ‌గా..రెండ‌వ భాగం షూట్ లో యూనిట్ బిజీగా ఉంది.