Begin typing your search above and press return to search.

అక్కడి మసీదులో అల్లు అర్జున్ వైఫ్

By:  Tupaki Desk   |   11 March 2017 4:43 PM GMT
అక్కడి మసీదులో అల్లు అర్జున్ వైఫ్
X
అల్లు అర్జున్ ప్రస్తుతం అరబ్ దేశాల్లో షూటింగ్ డీజే మూవీ షూటింగ్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం.. పాటల షూటింగ్ లో ఉన్నాడు స్టైలిష్ స్టార్. అక్కడ కొన్ని ఈవెంట్స్ లో పాల్గొంటూ.. సినిమా ప్రచారం కూడా పనిలో పనిగా కానిచ్చేస్తున్న బన్నీ.. మరోవైపు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసేస్తున్నాడు.

ఈ విషయం అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి స్నేహితులు ద్వారా వెల్లడైంది. గత సాయంత్రం అబుదాబిలోని షేక్ జాయేద్ మసీదుకు కూడా వెళ్ళారు. 11 ఏళ్ల పాటు నిర్మాణం జరపుకున్న ఈ మసీదును.. 2007లో ప్రారంభించగా.. దీని కోసం 2 బిలియన్ డాలర్లను వెచ్చించారు. ఇప్పటి మన కరెన్సీ లెక్కల్లో అయితే 3వేల 620 కోట్ల రూపాయల పైమాటే. ఈ మసీదు దగ్గర నుంచే బన్నీ వైఫ్ ఫోటో షేర్ చేసింది.

ఒకవైపు దువ్వాడ జగన్నాధం షూటింగ్.. మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్.. ఇంకోవైపు పబ్లిసిటీ యాంగిల్.. స్టైలిష్ స్టార్ ప్లానింగ్ చూస్తే షాక్ తినేయాల్సిందే. ఇంత ప్లాన్డ్ గా సినిమా చేయడం మరెవరి వల్లా కాదేమో అనిపించేయక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/