Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చీర‌లో అద‌రొట్టిన స్టైలిష్‌ స్టార్ వైఫ్‌!

By:  Tupaki Desk   |   1 Dec 2020 9:00 AM GMT
ఫోటో స్టోరి: చీర‌లో అద‌రొట్టిన స్టైలిష్‌ స్టార్ వైఫ్‌!
X
టాలీవుడ్ స్టార్‌ హీరోల‌కు పాన్ ఇండియా రేంజులో భారీ క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. అదే స్థాయిలో వారి వైఫ్ ల‌కు అభిమానుల్లో పాపులారిటీ ద‌క్కుతోంది. సోష‌ల్ మీడియాల్లో స్టార్ వైఫ్స్ క్రేజు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మ‌హేష్- రామ్ ‌చ‌ర‌ణ్- బన్ని లాంటి స్టార్ల స‌తీమ‌ణు‌ల‌కు సామాజిక మాధ్య‌మాల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. వారి ఇన్ స్టా ఖాతాల‌కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. బ‌న్నీ వైఫ్ స్నేహ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ ‌గా వుంటున్నారు. గారాల ప‌ట్టీలు అర్హ‌- అయాన్ ‌ల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం త‌గ్గ‌ని గ్లామ‌ర్ స్నేహ‌ సొంతం. హీరోయిన్ ల‌కు ధీటుగా అందంగా క‌నిపించే స్నేహ‌రెడ్డి స్టైలిష్ స్టార్ కు స‌రిజోడుగా హ‌బ్బీకి త‌గ్గ‌ట్టే త‌న అప్పియ‌రెన్స్ వుండేలా జాగ్ర‌త్త‌ప‌డుతూ వుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ లుక్ తో ఆక‌ట్టుకునే స్నేహ‌రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటో ఇట‌ర్నెట్ వైర‌ల్ గా మారింది. ఎంతో స్లిమ్ లుక్ తో స్టైలిష్ ‌గా క‌నిపించే స్నేహారెడ్డి చీర‌లో అంతే ట్రెండీగా క‌నిపిస్తున్నారు. ఆ రౌండ్ గాగుల్స్ ఎంతో ఆక‌ర్ష‌ణ‌ను పెంచాయి.

సాఫ్రాన్ క‌ల‌ర్ చీర‌లో స్నేహ‌రెడ్డి లుక్ వైబ్రేంట్ గా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో సంద‌డి చేస్తోంది. ఈ లుక్ చూసిన వారంతా మీరూ హీరోయిన్ అయిపోండి మేడ‌మ్ అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపుగా స్నేహారెడ్డి లుక్ ని 2.6 ల‌క్ష‌ల‌ మంది లైక్ చేయ‌గా 862 మంది వ్యాఖ్య‌ల్ని జోడించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.