Begin typing your search above and press return to search.

#క్యూటీస్.. అంటూ టీజ్ చేసిన బ‌న్ని

By:  Tupaki Desk   |   31 March 2021 5:30 AM GMT
#క్యూటీస్.. అంటూ టీజ్ చేసిన బ‌న్ని
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో ప‌ర్ఫెక్ట్ `ఫ్యామిలీ మ్యాన్` గా అభిమానుల హృద‌యాల్లో నిలిచారు. భార్య స్నేహారెడ్డి.. వార‌సులు అయాన్.. అర్హ‌ల‌తో బ‌న్ని నిరంత‌ర సెల‌బ్రేష‌న్ గురించి.. ఆహ్లాద‌క‌ర‌మైన ఆనంద‌క‌ర‌మైన‌ లైఫ్ స్టైల్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇక బ‌న్ని కుమార్తె అల్లు అర్హ అల్లరి వేషాల్ని ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. వీలున్న ప్ర‌తిసారీ కుటుంబ స‌మేతంగా విహార‌యాత్ర‌లను ఆస్వాధిస్తారు. ఫ్యామిలీ బ్రంచ్ లు కాఫీ డే పార్టీలు తెలిసిన వ్య‌వ‌హార‌మే.

ఇక అల్లు అర్హ అల్ల‌రి వేషాల్ని .. భార్య స్నేహ‌‌తో ఫోటోషూట్ల‌ను కూడా బ‌న్ని ఇంత‌కుముందు షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌రో క్యూట్ ల‌వ్ లీ ఫోటోని బ‌న్ని అభిమానుల కోసం ఇన్ స్టా మాధ్య‌మంగా షేర్ చేశారు. దానికి `క్యూటీస్` అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇంత‌కీ ఆ ఫోటోలో క్యూటీస్ ఎవ‌రో చెప్పాలా? ఒక‌రు అల్లు అర్హ‌.. ఇంకొక‌రు అల్లు స్నేహ‌. బ‌న్ని క్యాప్ష‌న్ వంద‌శాతం యాప్ట్ అని ఈ ఫోటో చూశాక అంగీక‌రించి తీరాల్సిందే. క్యూట్ మామ్ తో క్యూటీ అర్హ పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఫోజుతో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం అభిమానులు ఈ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

బ‌న్ని ఓవైపు పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో బిజీబిజీగా ఉన్నారు. ఇంత‌కుముందు మారేడు మిల్లి అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ‌కు భార్య కిడ్స్ తో పాటే వెళ్లారు. అక్క‌డ స్నేహ - అర్హ‌- అయాన్ విహార యాత్ర తెలిసిన‌దే. ఆ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం పుష్ప కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది.