Begin typing your search above and press return to search.

వాళ్ల మధ్యలో శిరీష్‌ కూడా..

By:  Tupaki Desk   |   6 Jun 2018 6:03 AM GMT
వాళ్ల మధ్యలో శిరీష్‌ కూడా..
X
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ తెలుగు కన్నా పక్క భాషలపై వైపు ఎక్కువ ద్రుష్టి పెట్టినట్లు గత కొంత కాలంగా వస్తున్న వార్తలను చూస్తుంటే అర్ధమవుతోంది. విజయం ఎంత వరకు అందుకుంటాడో గాని ఎంతో కొంత నటనమీద పట్టు తెచ్చుకుంటాడని చెప్పవచ్చు. ముఖ్యంగా మలయాళం తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నాడు. అక్కడ చేసిన ఒక సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

1971 ఇండో - పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన యుద్ధ భూమి అనే సినిమాలో మోహన్ లాల్ - అల్లు శిరీష్ నటించారు. గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఇక ఇటీవల డబ్బింగ్ పనులను ఫినిష్ చేసి జూన్ 22న రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అయితే జూన్ 21న విజయ్ దేవరకొండ టాక్సీ వాలా రిలీజ్ కానుంది. ఇక మరో వారం తరువాత తేజ్ ఐ లవ్ యు సినిమా రానుంది.

చివరగా ఒక్క క్షణం సినిమాతో కనిపించిన అల్లు శిరీష్ గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకున్నాడో ఏమో గాని ఈ ఏడాది మధ్యలో ఈ సినిమా మధ్యన దూరేస్తున్నాడు. విజయ్ - తేజ్ సినిమాలపై ఎంతో కొంత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. కానీ యుద్ధ భూమి మలయాళం జనాలని పెద్దగా ఆకట్టుకోలేదు మరి తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.