Begin typing your search above and press return to search.

#నిశ్చ‌య్‌.. అన్న వ‌దిన‌మ్మ‌ల‌తో కాబోయే వ‌రుడు..!?

By:  Tupaki Desk   |   12 Dec 2020 7:32 PM IST
#నిశ్చ‌య్‌.. అన్న వ‌దిన‌మ్మ‌ల‌తో కాబోయే వ‌రుడు..!?
X
నిశ్చ‌య్ వెడ్డింగ్ లో మెగా అల్లు హీరోల సంద‌డి గురించి తెలిసిన‌దే. ఇక ఇదే వేడుక‌లో అర‌డ‌జ‌ను పైగా క‌ల‌ర్ ఫుల్ క‌పుల్స్ చేసిన సంద‌డి పైనా డిజైన‌ర్ లుక్ పైనా ఆరాలు అంతే ఇదిగా సాగాయి. ఈ పెళ్లి కోసం మెగా అల్లు ఫ్యామిలీస్ పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ డిజైన‌ర్ లుక్ తో డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేయ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ లోనే ప్రెస్టేజియ‌స్ వెడ్డింగ్ ఈవెంట్ ఇది. నిహారిక‌-చైత‌న్య జంట డెస్టినేష‌న్ వెడ్డింగ్ పూర్త‌యింది. హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికీ అంత‌ర్జాలంలో పెళ్లి వేడుక‌కు సంబంధించిన అరుదైన ఫోటోలు అంత‌ర్జాలంలో రివీల‌వుతూనే ఉన్నాయి.

తాజాగా అల్లు అర్జున్ - స్నేహ జంట ముచ్చ‌టైన ఫోటో ఒక‌టి రివీలైంది. కిడ్స్ అల్లు అయాన్.. అల్లు అర్హ‌.. అన్వీతో ఈ స్టార్ క‌పుల్ క‌ల‌ర్ ఫుల్ గా ఫోజిచ్చారు. ఇక ఇదే ఫోటో ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీలో నెక్ట్స్ కాబోయే వ‌రుడు అల్లు శిరీష్ కూడా క‌నిపించారు. అన్న‌ట్టు మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ శిరీష్ దేనా? అంటూ అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది. శిరీష్ ఈ పెళ్లి ఆద్యంతం సుంద‌రాంగుడిలా ఇస్మార్ట్ లుక్ తో క‌నిపించాడు. షేర్వాణీ లు కుర్తా పైజామాల్లో పెళ్లికొడుకునే గుర్తు చేస్తున్నాడు. మ‌రి అల్లు బాస్ పిల్ల‌ను వెతుకుతున్నారా? అన్న‌దానికి లీకులు అందాల్సి ఉంది మ‌రి.