Begin typing your search above and press return to search.
పవన్-చిరు-అన్నయ్య ముగ్గురిని వాడేసాడు
By: Tupaki Desk | 29 Dec 2017 1:50 PM ISTనిన్న విడుదలైన అల్లు శిరీష్ ఒక్క క్షణం మూవీ పాజిటివ్ టాక్ తో బాగానే పికప్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ మీద కామెంట్స్ వస్తున్నప్పటికీ దర్శకుడు విఐ ఆనంద్ సెకండ్ హాఫ్ లో వాటిని చాలా మటుకు కవర్ చేయటంతో మొత్తానికి సినిమా బాగానే ఉంది అనే ఫీలింగ్ తో బయటికి వస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో మెగా ఫ్యామిలీ రెఫరెన్సులు కొన్ని ఉండటం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. డిజే సినిమాలో అన్నయ్య డైలాగ్ రచ్చో రచ్చస్య రచ్చబ్యహ ఒక చోట వాడితే - మరో సీన్ లో శిరీష్ దొంగ అయితే మామ కొండవీటి దొంగ అని వచ్చేలా సైడ్ ఆర్టిస్ట్ తో డైలాగ్ చెప్పించడం లాంటివన్నీ మెగా ఫాన్స్ ని ఆకట్టుకోవడానికే. సురభితో లవ్ ట్రాక్ రన్ అవుతున్నప్పుడు సైతం శిరీష్ పాత కొండవీటి రాజా సినిమాలో పాటను హం చేస్తూ కనిపిస్తాడు.
ఇవన్ని ఒక ఎత్తు అయితే అజ్ఞాతవాసి ట్రైలర్ లో అందరిని ఆకట్టుకున్న వీడి చర్యలు ఊహాతీతం అనే డైలాగ్ ను కూడా ఇందులో వాడేసారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు - బన్నీ కు మధ్య చెప్పను బ్రదర్ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎంత గ్యాప్ ఉందో చూస్తూనే ఉన్నాం. శిరీష్ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాని అవి పెద్దగా రిజల్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఒక్క క్షణంలో ఆ సినిమా విడుదలకు ముందే డైలాగ్ వాడుకోవడం అంటే పవన్ ఫాన్స్ ని మెప్పించడం కోసమే అని చెప్పొచ్చు. కాని ఈ మధ్యే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ట్రైలర్ డైలాగ్ ని ముందే ఎలా వాడుకున్నారు అనే డౌట్ కొందరు ఫాన్స్ కి వచ్చింది కాని అందులో ఏముంది మెగా కాంపౌండ్ కాబట్టి ముందే అది చూసి వాడేసుకుని ఉంటారు అని మెగా ఫాన్స్ అంటున్నారు. మొత్తానికి మావయ్యలు, అన్నయ్యను భలే తెలివిగా వాడుకున్నాడు శిరీష్.