Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ కి పెళ్లి కుదిరిందా?
By: Tupaki Desk | 13 Feb 2016 6:37 AMమెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయన్న విషయం మనకు తెలిసిందే. వచ్చే నెల్లోనే చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం జరగబోతోంది. ఆ సందడి పూర్తయిన వెంటనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి వేడుక కూడా జరగబోతోందా? అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ కి పెళ్లి కుదిరిందా? ఆయన చేసిన ఓ ట్వీట్ ఈ సందేహాల్నే రేకెత్తిస్తోంది. నాకు త్వరలోనే శ్రీమస్తు శుభమస్తు... మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ అల్లు శిరీష్ ఓ ట్వీట్ చేశాడు. మిగతా విషయాల్ని త్వరలోనే చెబుతా అన్నాడు. దీన్నిబట్టి శిరీష్ వివాహం ఫిక్స్ అయ్యిందేమో అని మాట్లాడుకొంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.
అయితే కొద్దిమంది మాత్రం అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ శ్రీమస్తు శుభమస్తు అయ్యి ఉంటుందని, అందుకే అలా ట్వీట్ చేశాడని చెప్పుకొంటున్నారు. అసలు విషయం తెలియాలంటే శిరీష్ మళ్లీ ట్వీటే ట్వీటు కోసం ఎదురు చూడాలిప్పుడు. ఇటీవల అల్లు శిరీష్ విలేకర్లతో మాట్లాడుతూ పెళ్లి గురించి ఇంకా నాలుగైదేళ్ల వరకు ఆలోచించని చెప్పుకొచ్చాడు. ఈలోపు ప్రేమలో పడినా అంత తొందరగా ఆ వ్యవహారం పెళ్లి వరకు రాలేదు. ఈ లెక్కన శిరీష్ ట్వీట్ తన కొత్త చిత్రానికి సంబంధించే అయ్యుంటుంది. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ చిత్రం చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రానికి సంబంధించి టైటిల్ కూడా ప్రకటించాల్సి వుంది. సో... శ్రీమస్తు శుభమస్తు అనేది టైటిలే అయ్యుంటుందని ఊహించొచ్చు. మామూలుగా పాట ప్రకారమైతే శ్రీరస్తు శుభమస్తు అని ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం శిరీష్ శ్రీమస్తు అని రాశాడేంటో. శిరీష్ మరోసారి ట్వీటితే తప్ప వీటన్నిటిపైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.