Begin typing your search above and press return to search.

తమ్ముడు కూడా డీజే అయ్యాడు

By:  Tupaki Desk   |   1 July 2017 10:04 AM IST
తమ్ముడు కూడా డీజే అయ్యాడు
X
డీజే అంటూ దువ్వాడ జగన్నాధ శాస్త్రిగా అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టాక్ అటూఇటూగా ఉన్నా.. ఈ మూవీ తొలి వారంలోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించడం.. బన్నీ మార్కెట్ స్థాయిని చెబుతోందని ట్రేడ్ జనాలు అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ తమ్ముడు కూడా డీజే అవతారం ఎత్తేశాడు.

సినిమాల్లోనే కాకుండా.. అవార్డ్ ఫంక్షన్స్ లో హోస్ట్ గా కూడా మెప్పించేయగల ప్రతిభ అల్లు శిరీష్ సొంతం. ఈ ఏడాది కూడా సైమా అవార్డుల వేడుకను.. అల్లు శిరీష్- మంచు లక్ష్మి కలిసి నిర్వహించారు. ఇద్దరూ తమ వాక్చాతుర్యంతో ఆహుతులను భలే మెప్పించేశారు. అయితే.. అల్లు శిరీష్ ఎంట్రీతోనే అదరగొట్టేశాడు. తన అన్నయ్య రీసెంట్ మూవీ డీజే గెటప్ లో.. స్టేజ్ పైకి వచ్చిన ఈ కుర్రాడు.. దువ్వాడ జగన్నాధ శాస్త్రిగా భలే అలరించాడు. మంచు లక్ష్మితో కలిసి తెగ నవ్వులు పూయించేశాడు.

అటు అన్నయ్య వెండితెరపై దువ్వాడ జగన్నాధంగా నవ్వులు పూయించి వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. ఇటు తమ్ముడు అల్లు శిరీష్ అవార్డు వేడుకలో డీజేగా వచ్చేసి నవ్వుల వాన కురిపించేశాడు. ఇక శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది శ్రీరస్తు శుభమస్తు హిట్ తర్వాత.. మలయాళంలో 1971 బెయాండ్ ది బోర్డర్స్ మూవీ చేసిన శిరీష్.. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాను రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. సురభి.. సీరత్ కపూర్ లు ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/