Begin typing your search above and press return to search.

ఇక ఆ ప్రాజెక్ట్ తెల్లారినట్టే అంటున్నారే!

By:  Tupaki Desk   |   28 April 2020 10:45 AM IST
ఇక ఆ ప్రాజెక్ట్ తెల్లారినట్టే అంటున్నారే!
X
సినీ కుటుంబాల నుంచి వస్తున్న కొత్త హీరోల పట్ల సాధారణ ఒకరకమైన వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే ఎంతో మంది ప్రతిభావంతులైన నటులు.. కృష్ణనగర్ గల్లీల్లో తిరుగుతూ ఉంటారు. జూబిలీ హిల్స్ ఫిలిం నగర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ వారికి అవకాశాలు రావు.. దాదాపుగా ఎవ్వరూ ఇవ్వడం లేదు. అయితే అత్తెసరు టాలెంట్ తో వస్తున్న సినీవారసుల వల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని చాలామంది అభిప్రాయం. ఈమధ్య పరిచయం అవుతున్న వారసులలో చాలామంది ప్రేక్షకుల తిరస్కరణకు గురికావడానికి ఇదే కారణమనే విశ్లేషణ కూడా ఉంది. ఈ లిస్టు లో కళ్యాణ్ దేవ్.. శిరీష్ లాంటి వారు కూడా ఉన్నాడని అంటున్నారు.

కళ్యాణ్ దేవ్ ఎవరు అని అడిగితే ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి చిన్నల్లుడు అంటే మాత్రం వెంటనే అందరూ గుర్తు పడతారు. ఈ హీరో డెబ్యూ మూవీ 'విజేత'. అదెప్పుడు వచ్చిందో.. ఎప్పుడు థియేటర్ల నుండి పోయిందో ఎవరికీ గుర్తు లేదు. ఈ సినిమా టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ సినిమా దర్శకుడి పేరు రాకేష్ శశి. ఈ డైరెక్టర్ కు మరో ఛాన్స్ వచ్చిందట. అల్లు శిరీష్ హీరోగా జీఎ2 పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించబోయే సినిమాకు రాకేష్ ను దర్శకుడిగా కన్ఫామ్ చేశారట. ఈ ప్రాజెక్ట్ బాధ్యతను తమ్మారెడ్డి భరద్వాజ చేతిలో పెట్టారని అంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్త డైరెక్టర్ కు ఈ సినిమాలో కూడా చేసేదేమీ ఉండదని.. తన టాలెంట్ బయట పెట్టుకోవడం అసాధ్యమని అంటున్నారు. ఎందుకంటే సగం డైరెక్షన్ తమ్మారెడ్డి చేస్తే మిగతా సగం శిరీష్ వెలగబెడతాడని.. అసలు డైరెక్టర్ కు చేసేందుకు ఏమీ మిగలదని ఇక ఆ ప్రాజెక్ట్ తెల్లారినట్టేనని అంటున్నారు. నిప్పు లేకుండా ఇలా కామెడీ పొగ అస్సలు రాదుగా!