Begin typing your search above and press return to search.
నిఖిల్ టాప్ సీక్రెట్ ని బయటపెట్టిన అల్లు శిరీష్
By: Tupaki Desk | 8 Jun 2021 7:31 AMయూత్ ఎనర్జిటిక్ స్టార్ గా పాపులరైన నిఖిల్ గత ఏడాది మొదటి లాక్ డౌన్ సమయంలో డాక్టర్ పల్లవిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. నిఖిల్ ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పల్లవిని ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే నిఖిల్ లవ్ స్టోరి గురించి తెలిసింది తక్కువ మందికే. ఇక ఇండస్ట్రీలో నిఖిల్ లవ్ లైఫ్ గుట్టంతా తొలిగా ఎవరికి తెలుసు? అంటే.. తాజాగా జవాబు దొరికింది.
తన పర్సనల్ సీక్రేట్ ని క్లోజ్ ఫ్రెండ్ అల్లు శిరీష్ తోనే తొలిగా నిఖిల్ షేర్ చేసుకున్నారట. నిఖిల్ ఓ ఇంటివాడై ఏడాది గడుస్తోంది. అయితే నిఖిల్ తన జీవిత భాగస్వామి డా.పల్లవితో డేటింగ్ చేస్తున్న సమయంలో ఆ విషయాన్ని తొలిసారిగా తన ఇండస్ట్రీ ఫ్రెండ్ అల్లు శిరీష్ దగ్గరే ఓపెనయ్యారట. ఆ సంగతి ఇప్పటివరకూ ఎవరికీ లీక్ కాలేదు.
ఇదే విషయాన్ని నిఖిల్ కి ఇటీవల పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ శిరీష్ ట్వీట్ చేశారు. వాస్తవానికి నిఖిల్ కి గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో సినిమా వచ్చేలా చేసింది శిరీష్ అనే టాక్ ఉంది. బాస్ అల్లు అరవింద్ కి నిఖిల్ ని పరిచయం చేసి తద్వారా నిఖిల్ తో జీఏ2 పిక్చర్స్ లో `18 పేజీస్` సినిమా తెరకెక్కేలా చేయడానికి మూలకారణం శిరీష్ తో నిఖిల్ కి ఉన్న స్నేహమే అని తెలుస్తోంది. మొత్తానికి నిఖిల్ - శిరీష్ మధ్య స్నేహం మునుముందు మినీ మల్టీస్టారర్ కి కూడా తెరతీస్తుందేమో చూడాలి.