Begin typing your search above and press return to search.

సైకో అంటూ అనూ బేబీకి అల్లు హీరో స్పెషల్ విషెస్.. సీక్రెట్ ఏంటో మరి..!

By:  Tupaki Desk   |   29 March 2021 8:25 AM GMT
సైకో అంటూ అనూ బేబీకి అల్లు హీరో స్పెషల్ విషెస్.. సీక్రెట్ ఏంటో మరి..!
X
సినిమా ఇండ‌స్ట్రీలో పుకార్లు అనేవి మాములే. ముఖ్యంగా లీడ్ పెయిర్స్ కాస్త క్లోజ్ గా ఉంటే చాలు వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌నే రూమ‌ర్స్ ట్రెండ్ అవుతుంటాయి. టాలీవుడ్ లో కూడా ఇలాంటివి తరచూ వింటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి రూమ‌ర్ ఒక‌టి ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. యువ హీరో అల్లు శిరీష్ - గార్జియస్ అను ఇమ్మాన్యుయేల్ మ‌ధ్య ఏదో న‌డుస్తోందని.. ఈ మధ్య వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసేవారికి ఈ విషయం అర్థం అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా శిరీష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అనూ కోసం పెట్టిన స్పెషల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. అనూ పుట్టిన‌రోజును పురస్కరించుకుని 'హ్యాపీ బర్త్ డే సైకో' అంటూ శిరీష్ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీనికి ఆమె ఓ మై గాడ్ అంటూ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

అయితే అల్లు శిరీష్ ప్ర‌స్తుతం అను ఇమ్మాన్యుయేల్ తో కలిసి నటిస్తున్నాడు కాబట్టే ఇలా క్లోజ్ గా ఉంటున్నాడని కామెంట్స్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. 'ఎబిసిడి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. సీక్రెట్ గా ఓ సినిమా చేసేస్తున్నాడు. ఇందులో అనూ బేబీనే హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. కానీ దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇద్దరూ కలిసి సినిమాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఆమాత్రం చనువుగా ఉంటారని.. అందులో అపార్ధాలు తీసి పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమాని అఫీసియల్ అనౌన్స్ చేసి రూమర్స్ కి చెక్ పెడతారేమో చూడాలి.