Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్.. ఇంకోటి స్టార్ట్ చేసేశాడు

By:  Tupaki Desk   |   28 April 2016 9:41 AM GMT
అల్లు శిరీష్.. ఇంకోటి స్టార్ట్ చేసేశాడు
X
మెగా ఫ్యామిలీ హీరోగా అరంగేట్రం చేశాడు అల్లు శిరీష్. అల్లు అర్జున్ కి సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత కొత్త జంటతో మాత్రం జనాలను బాగానే ఎంటర్టెయిన్ చేశాడు. ముచ్చటగా మూడో సినిమాని 'శ్రీరస్తు శుభమస్తు'ని రిలీజ్ కి రెడీ చేసి.. అదే ఊపుతో కొత్త మూవీకి కొబ్బరి కాయ కూడా కొట్టేశాడు.

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కనున్న మూవీకి ఇప్పుడు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొత్త దర్శకుడు ఎంవీఎన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ కథను అల్లు అరవింది సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేశాడని అల్లు శిరీష్ అంటున్నాడు. అంత పర్ ఫెక్ట్ గా డీటైలింగ్ ఇచ్చాడట డైరెక్టర్. ఈ మూవీ తన కెరీర్ కి బూస్టప్ ఇస్తుందని చెబ్తున్నాడు ఈ మెగా ఫ్యామిలీ హీరో. తొలిరోజు ముహూర్తం షాట్ కు మాస్ చిత్రాల దర్శకుడు, లేటెస్ట్ గా అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ హిట్ సరైనోడును ఇచ్చిన బోయపాటి శ్రీను క్లాప్ కొట్టాడు. ఫస్ట్ షాట్ కు శ్రీనువైట్ల కెమేరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహించాడు.

మెగాభిమానులకు తన కొత్త సినిమా వివరాలను అల్లు శిరీష్ ట్విట్టర్ లో వివరించి, తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ ఇస్తుండగా.. హీరోయిన్ ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా ముహూర్తాలతో తెగ బిజీబిజీగా గడిపేస్తున్నారు.