Begin typing your search above and press return to search.

శిరీష్ సినిమాలో ఆయన పాత్రే హైలైట్

By:  Tupaki Desk   |   8 Jun 2016 3:30 PM GMT
శిరీష్ సినిమాలో ఆయన పాత్రే హైలైట్
X
అల్లు వారబ్బాయి శిరీష్ హీరోగా నటించిన 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. శిరీష్ కి జోడీగా లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రాన్ని పరుశురామ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటల పిక్చరైజేషన్ మినహా.. షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్ ను కశ్మీర్ లో చేయబోతున్నట్లు దర్శకుడు పరశురామ్(బుజ్జి) తెలిపాడు. కశ్మీర్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుండగా.. ఎస్ ఎస్ థమన్ అందించిన ట్యూన్స్ అద్భుతంగా కుదిరాయని చెబుతున్నాడు హీరో శిరీష్.

త్వరలో భారీ ఎత్తున ఆడియో రిలీజ్ కు ప్లానింగ్స్ జరుగుతున్నాయి. 'శిరీష్ కు కూడా నాకు లాగే ఉమ్మడి కుటుంబాలంటే ఎంతో గౌరవం ఉంది. శ్రీరస్తు శుభమస్తు కోసం కలిసి చేసిన ప్రయాణంతో మేమిద్దరం ఎంతో దగ్గరయ్యాం. ఇక సినిమా గురించి చెప్పుకుంటే పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా కీలకం. పెళ్లితర్వాత వరుడు - వధువు బాధ్యతగా మెలగడం చాలా ముఖ్యం. మనతో పాటు ఫ్యామిలీ కూడా ఉంటేనే ఇది సాధ్యం' అంటున్నాడు పరశురామ్.

'మంచి సినిమాలను ఎంచుకుంటున్నందుకు నాకు బోలెడన్ని అబినందనలు వచ్చాయి. బుజ్జి తీస్తున్న ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో ప్రతీ కేరక్టర్ ఇంటర్ లింక్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా రావురమేష్ తో నాకు ఉండే సీన్స్ బాగా రక్తి కట్టిస్తాయి. సినిమాకు ఇవే హైలైట్ గా నిలుస్తాయి. చాలామంది సీనియర్స్ తో చేయడంతో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి' అంటున్నాడు అల్లు శిరీష్.