Begin typing your search above and press return to search.

శిరీష్ శ్రీరస్తు ఏమయిందంటారూ?

By:  Tupaki Desk   |   23 May 2016 11:30 AM GMT
శిరీష్ శ్రీరస్తు ఏమయిందంటారూ?
X
అల్లు శిరీష్.. స్టైలిష్ స్టార్ కి సోదరుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాను డిఫరెంట్ గా ఎటెంప్ట్ చేసి, అల్లు 'గౌరవం' పోగొట్టేశాడని అనిపించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అల్లు అరవింద్ ఎంతో ప్లాన్డ్ గా మారుతీ కొత్త జంట సినిమాని రూపొందించాడు. ఇది విజయం సాధించేయకపోయినా.. మారుతీ టేకింగ్ - రెజీనా గ్లామర్ అండతో.. అంతో ఇంతో ఆడేసింది.

తన మూడో సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని నిర్ణయించుకున్న అల్లు శిరీష్.. పరుశురామ్ తో జత కట్టాడు. లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్న శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని చేశాడు అల్లు శిరీష్. మెగా ఫ్యామిలీ హీరో శిరీష్ చేసిన మూవీ మార్చ్ లో రిలీజ్ అంటూ ఎప్పుడో చెప్పింది లావణ్య. తీరా మార్చ్ నెలలో ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఈ లెక్కన సమ్మర్ కి రిలీజ్ అవుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వేసవి దాదాపు పూర్తయిపోతోంది. మిగిలిన వారాలకు కూడా సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. ఏప్రిల్ లో వచ్చిన సరైనోడు ఇంకా సత్తా చాటుతూనే ఉన్నాడు. కానీ శ్రీరస్తు శుభమస్తు సంగతి మాత్రం తేల్చలేదు అల్లు ఫ్యామిలీ.

అనుకున్న స్థాయిలో రాకపోవడంతో.. అనేక సీన్స్ ను అల్లు అరవింద్ దగ్గరుండి రీషూట్ చేయిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. మెగా హీరోతో సక్సెస్ సాధించాలనే తపనతో ఉన్న దర్శకుడు పరుశురామ్.. మరింత పక్కాగా సీన్స్ రాసుకుని తీస్తున్నాడట. ఇప్పటికైతే శ్రీరస్తు శుభమస్తు విడుదల ఎప్పుడో అన్న సంగతి చెప్పడం కష్టమే.