Begin typing your search above and press return to search.

సెల్ఫీలు ఊరికే రావంటున్న శిరీష్

By:  Tupaki Desk   |   4 July 2018 4:27 AM GMT
సెల్ఫీలు ఊరికే రావంటున్న శిరీష్
X
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ ఈ ఒక్క మాటతో లలితా జ్యూయలర్స్ ను పాపులర్ చేశాడు ఆ కంపెనీ ఎండీ కిరణ్ కుమార్. ఎప్పుడూ నున్నటి బోడిగుండులో తమాషాగా కనిపిస్తూ తన కంపెనీ యాడ్ లో స్వయంగా తనే యాక్ట్ చేస్తూ చాలా తక్కువ టైంలో జనాలందరికీ నోటయ్యాడు.

ఈ యాడ్ల పుణ్యమా అని ఆయనకు సెలబ్రీలకున్నంత ఇమేజ్ వచ్చేసింది. అందుకే మెగా హీరో అల్లు శిరీష్ ఆయనను చూడగానే తెగ ఎగ్జయిట్ అయిపోయాడు. రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఫ్లైటెక్కేందుకు వెళ్లిన శిరీష్ కు ఈ గుండు బాస్ కనిపించాడు. దాంతో ఆయనను కలిసి ఓ సెల్ఫీ తీసుకుంటానని అడిగేశాడట. దానికి కిరణ్ కుమార్ కూడా ఓకే అనేయడంతో ఆయనతో కలిసి ఓ సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా దానికో ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు. లలితా జ్యూయలర్స్ యాడ్ స్టయిల్లోనే ‘‘సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు.. లక్ ఉండాలి’’ అంటూ శిరీష్ పెట్టిన నెటిజన్లను భలే ఆకట్టుకుంది.

రీసెంట్ గా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో ఒక్క క్షణం సినిమా చేసిన శిరీష్ కు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం ఏబీసీడీ అనే మళయాళ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు. యాన్ యాక్రోనిమ్ ఫర్ అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ అనేది ఏబీసీడీకి అర్ధం. ఈ సినిమాతో సంజీవ్ తొలిసారి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.