Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ మీద శిరీష్‌ పంచ్ పగిలిపోయింది

By:  Tupaki Desk   |   18 Aug 2016 7:36 AM GMT
క్రిటిక్స్ మీద శిరీష్‌ పంచ్ పగిలిపోయింది
X
మొన్నటికి మొన్న మనం 100 కోట్ల మంది ఉన్నా కూడా కనీసం ఒక్క మెడల్ కూడా రాలేదు అంటూ ప్రముఖ క్రిటిక్ శోభా ఢే నోరుపాడేసుకుంది. రియో నగరంలో జరుగుతున్న 2016 ఒలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ మెడల్స్ ఖాతా తెరవకపోవడంతో ఇలాంటి కామెంట్లు చేసింది ఆమె. ఆ తరువాత ఇండియా అంతా ఒక్కటై ఆమెపై విమర్శలు గుప్పించారు.

ఇకపోతే ఈ తెల్లవారుజామును సాక్షి మాలిక్ వ్రెజ్లింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలవడంతో.. ఇప్పుడు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంగా శోభా వంటి క్రిటిక్స్ పై జనాలు ఇంకా విరుచుకుపడుతున్నారు. నేనేమన్నా తక్కువా అంటూ అల్లు శిరీష్‌ కూడా ఒక పంచ్ వేశాడు. ఓ విధంగా చూస్తే ఆ పంచ్ పగిలిపోయిందనే చెప్పాలి. ''ఇండియన్స్ అందరికీ మెడల్స్ కావాలి. ఒలింపిక్స్ లో ఇండియా పతకాలు కొట్టేయాలి. కాని తమ పిల్లలను మాత్రం అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాలనే కోరుకుంటున్నారు'' అంటూ మీనింగ్ వచ్చే ఒక కామిక్ స్ర్టిప్ షేర్ చేశాడు శిరీష్‌. నిజమే కదా.. అందరూ మెడల్స్ కావాలి.. మనోళ్ళు సరిగ్గా ఆడలేదు.. మన దగ్గర టాలెంట్ లేదు.. అంటూ కామెంటు చేయడమే కాని.. ఎంతమంది తమ పిల్లలు జిమ్నాస్టులుగా - వ్రెజ్లర్లుగా తయారు కావాలని పంపిస్తున్నారు?

అమెరికాకు 90 మెడల్స్ వచ్చాయి.. చైనాకు 54 మెడల్స్ వచ్చాయి అంటూ దెప్పిపొడిచేవారు.. కేవలం గవర్నమెంటును ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు అంటూ కామెంట్ చేసేవారూ.. ఒక్కసారి తమ ఫ్యామిలీ నుండి ఎంతమంది ఒలింపిక్ క్రీడల కోసం కష్టపడుతున్నారు అనే విషయం చెప్పాల్సిందే చదువుకున్నామా, జాబ్ చేస్తున్నామా, డబ్బులు సంపాదిస్తున్నామా అనేదే మన ప్రపంచం అయినప్పుడు మెడల్స్ పైన కామెంట్లు ఎందుకులే.