Begin typing your search above and press return to search.

పోప్ - షారూఖ్‌ లనే వదట్లేదు.. నేనెంత?

By:  Tupaki Desk   |   3 Aug 2016 11:29 PM IST
పోప్ - షారూఖ్‌ లనే వదట్లేదు.. నేనెంత?
X
చాలా సార్లు పెద్ద పెద్దోళ్లతో పోల్చుకుంటే వినేవాళ్లకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం కరెక్టే కదా అనిపించక మానదు. అలాంటిదే ఓ కంపారిజన్ ను పట్టుకొచ్చాడు అల్లు శిరీష్. ఈ శుక్రవారం విడుదలవతోన్న శ్రీరస్తు శుభమస్తు మూవీ కోసం విరివిగా ప్రచారం చేస్తున్నాడు అల్లుహీరో. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించాడు.

గౌరవం.. కొత్త జంట చిత్రాలు నిరుత్సాహపరిచిన తర్వాత.. అల్లు శిరీష్ పై చాలానే విమర్శలొచ్చాయి. ఆన్‌ లైన్‌ లో విపరీతంగా ట్రాలింగ్ జరిగింది. దీనిపై స్పందించిన అల్లు శిరీష్.. 'ఐదేళ్ల క్రితం నేను బాగా సెన్సిటివ్. అప్పుడు ప్రతీ అంశానికి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యేవాడిని. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. షారూక్ ఖాన్ నుంచి పోప్ వరకూ ప్రతీ ఒక్కరూ ట్రాలింగ్ బారిన పడుతున్నారు. పాపులర్ అవుతున్నపుడే ఇలాంటివి ప్యాకేజ్ టైపులో వచ్చేస్తాయి. ప్రతీదాన్ని ఓపిగ్గా తీసుకోగలగాలి' అని చెప్పాడు.

ప్రధానంగా శిరీష్ లుక్స్.. యాక్టింగ్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లుక్స్ విషయంలో అన్నయ్య స్టైలిష్ స్టార్ నుంచి చాలానే నేర్చుకున్నట్లాడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తులో స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఇక యాక్టింగ్ విషయంలో ఈ అల్లు హీరో ఏ మాత్రం డెవలప్ అయ్యాడో తెలియాలంటే మరో 36 గంటలు ఆగాల్సిందే.