Begin typing your search above and press return to search.

నేను ఏ రీమేకులూ చేయట్లేదు -మెగా హీరో

By:  Tupaki Desk   |   13 Oct 2015 4:15 PM IST
నేను ఏ రీమేకులూ చేయట్లేదు -మెగా హీరో
X
సడన్‌ గా ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని.. ఈరోజు ఉదయం ఒక న్యూస్‌ వచ్చింది.. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి కత్తి సినిమాను రీమేక్‌ చేస్తుంటే.. రామ్‌ చరణ్‌ తని ఒరువన్‌ సినిమాను రీమేక్‌ చేస్తున్నాడు. ఇక ఇదే బాటలో యంగ్‌ మెగా హీరో అల్లు శిరీష్‌ కూడా నడుస్తున్నాడని ఒక టాక్‌ వచ్చేసింది. మరి ఇందులో నిజమెంతా అని వెరిఫై చేస్తే.. అల్లూ బాబూ ఇలా స్పందించాడు.

''నేను ఎటువంటి రీమేక్‌ చేయట్లేదు. అసలు ఆ రూమర్ లలో చెప్పిన తమిళ సినిమా పేరు కూడా ఇదే ఫస్టు టైమ్‌ వింటున్నా. ఆ వార్తలు నమ్మకండి నిజం లేదు. సాధారణంగా ఇలాంటి రూమర్లపై నాకు స్పందించాల్సిన అవసరం లేదు. కాని ఇలాంటి రూమర్లు రావడం వలన.. నాకు కథలు చెప్పి నా సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్న దర్శకులు హర్టవుతారు. వారందరికీ చెప్పకుండా ఇలా సడన్‌ గా ఏ సినిమానూ ఓకె చేయను. ప్రస్తుతం పరశురాం డైరక్షన్‌ లో సినిమా ఒక్కటే చేస్తున్నా'' అంటూ సెలవిచ్చాడు అల్లు శిరీష్‌.

ఇక సదరు రూమర్ ఏమని చెప్పిందంటే.. తమిళంలో గత సంవత్సరం విడుదలైన ''యామురిక్క బయమెయ్'' అనే ఓ చిన్న హారర్‌ సినిమాను శిరీష్‌ బాగా ఇష్టపడి.. అదే తమిళ డైరక్టర్‌ తో కలసి రీమేక్‌ చేస్తున్నాడని ప్రచారం అయ్యింది. సో.. ఇందులో నిజం లేదన్నమాట.