Begin typing your search above and press return to search.

కాపీ అయితే నిలదీసి అడగండి -శిరీష్‌

By:  Tupaki Desk   |   18 Dec 2017 7:17 AM GMT
కాపీ అయితే నిలదీసి అడగండి -శిరీష్‌
X
ఏ సినిమాకైనా కాపీ కథ అనే ముద్ర పడితే అక్కడ సినిమా రిజల్ట్ పై తేడా కొడుతుంది. దర్శకుడిపై కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు ఎంత కొత్తధనం కోరుకుంటున్నారో హిట్ అయిన సినిమాలను చూసి చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా అల్లు హీరో శిరీష్ సినిమా ఒక్క క్షణం కాపీ కాన్సెప్ట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమా హీరో చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

అయితే కొరియన్ ఫిల్మ్ పార్లేల్ లైఫ్ కథ ఆధారంగా కథను తెరకెక్కించారని కొన్ని మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. అంతే కాకుండా 2 మేమిద్దరం అనే సినిమా కూడా ఒక్క క్షణం సినిమాలనే ఉండబోతోంది అని టాక్ వస్తోంది. ఆ సినిమా ట్రైలర్ కూడా పలు అనుమానాలు కలిగిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది. ముఖ్యంగా హీరో శిరీష్ మాట్లాడుతూ.. ''మా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మిరే నిలదీసి అడగండి. అది కాపీ కథనా? కాదా అని. నేను మొన్న ఆ న్యూస్ వచ్చాక కొరియన్ సినిమా చూశాను. ఆ కథ వేరు.. మా కథ వేరు. మా ఒక్క క్షణం సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మా సినిమాకు వారి సినిమాకు సంబంధం అస్సలు లేదు. చూసిన తర్వాత అలా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ గా అడగండి'' అంటూ శిరీష్ ఛాలెంజ్ విసిరాడు.

రీసెంట్ గా సినిమాలోని చివరి సాంగ్ చిత్రీకరించిన జరిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని విషయాలను తెలిపారు. సినిమా 28న రిలీజ్ కాబోతోంది. మరికొన్ని రోజుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా ప్లాన్ చేయబోతున్నాం అని శిరీష్ తెలిపాడు. దర్శకుడు విఐ ఆనంద్ కూడా సినిమా చాలా కొత్తగా ఉంటుందని రూమర్స్ ని నమ్మవద్దని చెప్పాడు. పూర్తిగా ఇది కొత్త కాన్సెప్ట్ అని వివరించాడు. అయితే శిరీష్ 2 మేమిద్దరం సినిమాపై స్పందిస్తూ.. హీరో తనకు ముందే పరిచయం. సో ఆ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా అని తెలిపాడు.