Begin typing your search above and press return to search.
అల్లు వారి అబ్బాయి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?
By: Tupaki Desk | 22 April 2020 8:10 AM GMTటాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు అల్లు శిరీష్. మెగా మేనల్లుడిగా.. అల్లు వారి అబ్బాయిగా టాలీవుడ్ హీరోగా 'గౌరవం'తో ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్ గ్రౌండ్.. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అండ ఉన్న శిరీష్ కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు. మెగా బ్రాండ్ ఉండి కూడా ఇప్పటి వరకు సొంత గుర్తింపు తెచ్చుకోలేదు శిరీష్. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఈయనకు ఇమేజ్ మాత్రం రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మార్క్ చూపించలేదు. అల్లు శిరీష్ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే పరుశురాం దర్శత్వంలో వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒక్కటే అని చెప్పాలి. కానీ ఆ విజయాన్ని కొనసాగించలేకపోయారు. కొరియన్ ఫిల్మ్ ఆధారంగా చేసిన 'ఒక్క క్షణం' సినిమా చేసాడు. అది డైరెక్టర్ కి మంచి పేరే తీసుకొచ్చింది కానీ మనోడికి ఏమాత్రం యూస్ అవలేదు. ఆ తర్వాత మలయాళ హిట్ ఫిల్మ్ రీమేక్ 'ఏబీసీడీ'తో ముందుకొచ్చాడు. 'ఏబీసీడీ' కూడా డిజాస్టర్ అయిపోయింది. దాంతో అల్లు శిరీష్ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. ఈ క్రమంలో ఓ వైపు హీరోగా నటిస్తూనే ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు వచ్చాడు. ఈయన 'సిటీలో సంక్రాంతి' అనే షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.
కానీ వెండితెర మీద 'ఏబీసీడీ' తర్వాత మరో సినిమా పట్టాలెక్కించలేకపోయాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ దూసుకుపోతుంటే.. అల్లు శిరీష్ మాత్రం ఇంకా వెనుకబడి పోయాడు. ఇంకా సరైన సక్సెస్ కోసం స్టార్ డమ్ కోసం పరుగులు పెడుతూనే ఉన్నాడు అల్లు శిరీష్. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక రీమేక్ సినిమాతో రాబోతున్నాడట శిరీష్. తమిళంలో రిలీజై హిట్ కొట్టిన ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెలుగులో రీమేక్ చేసేందుకు శిరీష్ ప్లాన్ లో ఉన్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఏబిసిడి ఫ్లాప్ తరువాత శిరీష్ గ్యాప్ తీసుకొని బాడీ తదితర వర్క్ అవుట్స్ చేసి షేప్ మార్చినట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మొత్తం మీద అల్లు వారి అబ్బాయి రెండు సినిమాలు మాత్రం లైన్ లో పెట్టాడట. వాటిలో ఈ రీమేక్ ఉందో లేదో చూడాలి.