Begin typing your search above and press return to search.
శిరీష్ కోటి దగ్గరకు వచ్చేశాడా??
By: Tupaki Desk | 3 Jan 2017 11:30 AM GMTస్టైలిష్ స్టార్ కి తమ్ముడిగా.. అల్లు వారసుడిగా అరంగేట్రం చేసిన అల్లు శిరీష్.. ఆరంభంలోనే గౌరవంతో పెద్ద షాక్ తినేశాడు. ఆ తర్వాత కొత్త జంట అంటూ మరో ప్రయత్నంతో యావరేజ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మాత్రం లాంగ్ లాంగ్ గ్యాప్ ఇచ్చి మరీ శ్రీరస్తు శుభమస్తు మూవీతో సక్సెస్ అందుకోగలిగాడు. ప్రస్తుతం మలయాళంలో 1971:బెయాండ్ బోర్డర్స్ అనే మూవీలో నటిస్తున్నాడు శిరీష్. మోహన్ లాల్ తో కలిసి చేస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.
తెలుగులో ప్రాజెక్టులు ఎంచుకోవడంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న శిరీష్.. తాజాగా దర్శకుడు వీఐ ఆనంద్ తో ఓ మూవీకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ హిట్ సాధించిన ఈ డైరెక్టర్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని అల్లు శిరీష్ తో చేయడం దాదాపు ఖాయమే. అయితే.. ఈ మూవీ కోసం శిరీష్ కి ఏకంగా ఒక కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారన్నదే అతి పెద్ద న్యూస్ అయిపోయింది. ఒక ఫ్లాప్.. ఒక యావరేజ్.. ఒక హిట్ ఉన్న హీరోకి ఇంత మొత్తం అంటే అది రికార్డ్ ప్రైస్ కిందే లెక్క.
అయితే.. శ్రీరస్తు శుభమస్తు చిత్రం శాటిలైట్ రైట్స్ తో కలుపుకుని ఏకంగా 15 కోట్ల బిజినెస్ చేయగలిగింది. పైగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో కావడంతో.. కోటి రూపాయల పారితోషికం ఇవ్వడం అంటే పెద్ద విషయమేం కాదని భావిస్తుండడంతోనే.. ఇంత మొత్తం అందుకుంటున్నాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/