Begin typing your search above and press return to search.

అన్నయ్య అభినందించారు.. నెక్ట్స్‌ లెవల్‌ కు తీసుకు వెళ్తున్నా : అల్లు శిరీష్‌

By:  Tupaki Desk   |   19 Aug 2020 9:45 AM IST
అన్నయ్య అభినందించారు.. నెక్ట్స్‌ లెవల్‌ కు తీసుకు వెళ్తున్నా : అల్లు శిరీష్‌
X
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌ ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయాడు. అయితే హీరోగా నిరాశ పర్చినా కూడా శిరీష్‌ ఒక వ్యాపారవేత్తగా మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి మంచి వ్యూహాలతో ముందుకు వెళ్లే వ్యక్తి అంటూ ఆయన గురించి తెలిసిన వాళ్లు అంటూ ఉంటారు. తక్కువ వయసులోనే ఆయన వ్యాపారంలో మంచి లాభాలు సాధించి కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈయన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రారంభించిన ‘బై లోకల్‌ బి వోకల్‌’ క్యాంపెయిన్‌ లో పాల్గొంటున్నాడు.

ఇప్పటికే బై లోకల్‌ బి వోకల్‌ అంటూ శిరీష్‌ ప్రచారం మొదలు పెట్టారు. ఇండియాలో తయారు అయ్యే ప్రాడక్ట్స్‌ పై ఇండియన్స్‌ లో కొంత అపనమ్మకం ఉంది. దాన్ని ఎప్పుడు అయితే వదిలేస్తారో అప్పుడు బై లోకల్‌ బి వోకల్‌ సాధ్యం అవుతుందని శిరీష్‌ అన్నాడు. తాను మాత్రం ఇప్పటికే దాన్ని ఫాలో అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. టూత్‌ పేస్ట్‌ పతాంజలి నుండి మొదలుకుని చాలా వరకు ఇండియన్‌ మేడ్‌ వాడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

తాను చేస్తున్న ఈ క్యాంపెయిన్‌ గురించి వదిన ద్వారా తెలుసుకున్న బన్నీ అన్నయ్య అభినందించాడంటూ శిరీష్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్యాంపెయిన్‌ ను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు నేను రాబోయే రెండు మూడు నెలల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రముఖులు సెలబ్రెటీలు స్టార్స్‌ అంతా కూడా ఈ క్యాంపెయిన్‌ లో పాల్గొనాలని బై లోకల్‌ అంటూ నినదించాలని శిరీష్‌ విజ్ఞప్తి చేశాడు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ఒక వెబ్‌ సిరీస్‌ ను రాకేష్‌ శశి దర్శకత్వంలో ఆహా కోసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.