Begin typing your search above and press return to search.

ఆ సినిమాను హోల్డ్ లో పెట్టేశాను -శిరీష్‌

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:24 PM GMT
ఆ సినిమాను హోల్డ్ లో పెట్టేశాను -శిరీష్‌
X
మామూలుగా ఈ మధ్యన ఏదైనా సినిమా ఆగిపోతే.. దాని గురించి మొదట నాలుగు రోజులు వెబ్ లో రూమర్లు వస్తున్నాయి. ఆ తరువాత అవన్నీ నిజం కాదని కొందరు ట్వీట్లు వేయడం. తరువాత ఆ నిర్మాత ఏదో ఒక పేపర్ వారితో అవును సినిమాను ఆపేశాం అంటూ కన్ఫామ్ చేయడం. ఆ తరువాత అందరూ సినిమా ఆగిపోయిందని నమ్మడం. కాని ఈ తతంగం అంతా అనవసరమైన రచ్చను క్రియేట్ చేయట్లేదూ?

అందుకే చాలా క్లియర్ గా తన తదుపరి సినిమాను హోల్డులో పెట్టేసినట్లు హీరో అల్లు శిరీష్‌ చాలా సింపుల్ గా చెప్పేశాడు. ''మెహ్రీన్ కౌర్ పీర్జాదా హీరోయిన్ నేను ఎం.వి.ఎన్.రెడ్డి (మల్లిడి వేణు) డైరక్షన్లో చేయనను్న సినిమాను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేశాం. ఈ సినిమాకు చాలా గ్రాఫిక్స్.. కొత్తరకం సెట్స్.. కొత్త లొకేషన్స్ అవసరం. అందుకే కనీసం ఒక ఆర్నెల్లు ప్రీ-ప్రొడక్షన్ వర్కుకు టైమ్ పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టి సినిమాలో చేయాల్సిన నటులందరం ఇతర ప్రాజెక్టులు చేసుకోవాలని ఫిక్సయ్యాం. అన్నీ సెట్టయిన తరువాత ఈ సినిమాను మళ్లీ స్టార్ట్ చేస్తాం'' అంటూ సెలవిచ్చాడు అల్లు శిరీష్‌.

ఇంత క్లియర్ గా ఒక హీరో ప్రకటన ఇవ్వడమంటే అది మామూలు విషయం కాదు. కాని ఇక్కడో బ్యాడ్ లక్ ఏంటంటే.. మల్లిడి వేణు ఎలియాస్ ఎం.వి.ఎన్ రెడ్డికి ఇలా సినిమా ఆగిపోవడం రెండోసారి. దీనికంటే ముందు నితిన్ సినిమా కూడా ముహూర్తం ఈవెంట్ జరిగాక ఆగిపోయింది. ఇప్పుడు శిరీష్‌ ఫిలిం కూడా అంతే. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/