Begin typing your search above and press return to search.
చిన్నబ్బాయ్ ఏమైపోయాడబ్బా!
By: Tupaki Desk | 23 April 2018 11:30 PM GMT యంగ్ హీరోలు మహా హుషారుగా ఉంటున్నారు. ఈ జనరేషన్ హీరోల్లో అల్లు వారి చిన్న తనయుడు శిరీష్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. హీరో స్టేటస్ ఉన్నవారిలో.. ఓ అవార్డ్ ఫంక్షన్ కు హోస్ట్ గా వ్యవహరించడం అనే కల్చర్ ను.. టాలీవుడ్ లో మొదలుపెట్టిన హీరో శిరీష్. తర్వాత నాని.. రానా వంటి హీరోలు దీన్ని కంటిన్యూ చేశారు.
అయితే.. అల్లు శిరీష్ గత కొంతకాలంగా కనిపించుట లేదు. గతేడాది చివరలో వచ్చిన ఒక్క క్షణం మూవీ రిలీజ్ సమయంలో మాంచి హుషారుగా కనిపించిన అల్లు తనయుడు.. ఆ తర్వాత మళ్లీ వార్తల్లో ఎక్కడా వినిపించడం లేదు. పైగా ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్టు కూడా ఫైనలైజ్ చేసుకోలేదని తెలుస్తోంది. అలాగని సినిమాలకు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చాడా అంటే.. అలాంటిది కూడా ఏమీ లేదు. భేషుగ్గా కథలు వింటున్నాడు. కానీ ఓ పట్టాన ఏ స్టోరీని అంగీకరించలేకపోతున్నాడట. గత నాలుగు నెలల సమయంలో ఇతడు విన్న కథల లెక్క పదుల సంఖ్యలోనే ఉన్నాయని అంటున్నారు.
అయితే.. అసలు తాను ఎలాంటి సినిమా చేయాలనే విషయంపైనే ఇంకా తేల్చుకున్నాడట అల్లు శిరీష్. ప్రయోగాలు చేయాలా లేకపోతే రొటీన్ కమర్షియల్ మూవీ చేయాలా అనే అంశంపై ఇంకా క్లారిటీ తెచ్చుకోలేకపోవడంతో.. తన మరుసటి చిత్రం సంగతి అనౌన్స్ చేయలేకపోతున్నాడట అల్లు శిరీష్.