Begin typing your search above and press return to search.

మ్యూజిక్ వీడియో కోసం ఆటో డ్రైవర్ గా అల్లు శిరీష్..!

By:  Tupaki Desk   |   19 March 2021 10:15 AM GMT
మ్యూజిక్ వీడియో కోసం ఆటో డ్రైవర్ గా అల్లు శిరీష్..!
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు.. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ముంబైలో ఆటో డ్రైవర్ గెటప్ లో ఓ సాంగ్ షూట్ లో పాల్గొన్నట్లు మనం ఇది వరకే వెల్లడించాం. అయితే అల్లు వారి అబ్బాయి ఆటోవాలా గెటప్ తన అప్ కమింగ్ మూవీ కోసమా లేదా ఏదైనా ప్రైవేట్ సాంగ్ కోసమా అన్నది క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక దీనిపై స్పష్టత ఇచ్చాడు. 'విలాయటి శరాబ్‌' అనే మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఆటో డ్రైవర్ గా మారినట్లు శిరీష్ ద్వారా వెల్లడించారు.

నౌషాద్ ఖాన్ సమర్పిస్తున్న 'విలాయటి శరాబ్‌' సాంగ్ లో నటి హెలి దారువాలాతో కలిసి అల్లు శిరీష్ స్టెప్పులు వేసాడు. ఆదిల్ షేక్ ఈ సాంగ్ కు డైరెక్షన్ చేశారు. లిజో జార్జ్ మరియు డిజె చేటాస్ కలిసి ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయగా.. దర్శన్ రావల్ - నీతి మోహన్ ఆలపించారు. కుమార్ లిరిక్స్ రాసారు. అనురాగ్ సోలంకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. ఇండీ మ్యూజిక్ లేబుల్ నుంచి వస్తున్న ఈ 'విలాటి శరాబ్' సాంగ్ మార్చి 22న విడుదల కానుంది.

ఈ సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేస్తూ.. ''విలాటి శరబ్‌ సాంగ్ లో ఆటో డ్రైవర్‌ గా కనిపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను తెలుగు సినిమాలలో కూడా ఇలాంటి పాత్ర చేయలేదు. నన్ను ఇలా కొత్తగా చూపించినందుకు నా డైరెక్టర్ ఆదిల్ షేక్‌ కు ధన్యవాదాలు. ఈ పాట మార్చి 22, సోమవారం రిలీజ్ కానుంది'' అని పేర్కొన్నారు. మరి ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్ లో చేస్తున్న అల్లు శిరీష్ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.