Begin typing your search above and press return to search.

ఆల్ ఇన్ వన్ అల్లు హీరో

By:  Tupaki Desk   |   29 May 2018 4:13 AM GMT
ఆల్ ఇన్ వన్ అల్లు హీరో
X
పొద్దునే లేచి షూటింగ్ స్పాట్ కొచ్చి మేకప్ వేసుకుని అసిస్టెంట్ డైరెక్టర్లు ఇచ్చిన స్క్రిప్ట్ పేపర్ బట్టీబట్టి డైరెక్టర్ యాక్షన్ రెడీ అయిపోయి కట్ చెప్పేవరకు కరెక్ట్ గా చేసేసి ఇంటికెళ్లిపోవడం.. బేసిగ్గా ఇదే హీరోల పని. కానీ ఇదంతా కిందటి జనరేషన్ ట్రెండ్. ఇప్పుడు హీరోలు సినిమాలో ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. స్టోరీ సెలక్షన్ నుంచి డైరెక్షన్ వరకు ప్రతి విషయంలో గ్రిప్ పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు.

మెగా ఫ్యామిలీలోని అల్లు శిరీష్ ఈ విషయంలో ఒక అడుగు ముందున్నాడు. శిరీష్ తాజాగా ఏబీసీడీ అనే సినిమా చేస్తున్నాడు. యాన్ యాక్రోనిమ్ ఫర్ అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ అనేది ఏబీసీడీకి అర్ధం. మళయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాకు సంబంధించి ఏబీసీడీలు మాత్రమే కాదు... ఏకంగా ఏ టూ జడ్ శిరీష్ అన్నీ దగ్గరుండి స్వయంగా చూసుకుంటున్నాడు. ఈ సినిమాతో సంజీవ్ తొలిసారి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. దర్శకత్వంలో అనుభవం లేకపోవడంతో శిరీష్ అతడికి అన్ని విషయాల్లో హెల్ప్ అందిస్తున్నాడు.

ఈ సినిమాకు కాస్టూమ్ డిజైనర్ గా ఎవరిని తీసుకోవాలి.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలి అనేది శిరీషే ఫైనల్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా కన్నడ సూపర్ హిట్ మూవీ చమక్ కు సంగీతం అందించిన జూడా శాండీని ఎంచుకున్నాడు. ఈ సినిమా విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనే షేర్ చేస్తున్నాడు. ఒక హీరో ఇలా ఆల్ ఇన్ వన్ లా వ్యవహరించడం అంటే మామూలు విషయమేం కాదు. అల్లు వారబ్బాయి చొరవ అతడికి ఏ మేరకు సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి.