Begin typing your search above and press return to search.

శిరీష్ బాబాయ్ తో కలిసి స్టెప్పులేస్తున్న అయాన్!

By:  Tupaki Desk   |   16 May 2020 8:00 PM IST
శిరీష్ బాబాయ్ తో కలిసి స్టెప్పులేస్తున్న అయాన్!
X
అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పిల్లలు అల్లు అయాన్ మరియు అర్హ చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ స్టార్ కిడ్స్ కి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అల్లు అయాన్ - అల్లు అర్హ‌.. ఇద్ద‌రూ వేగంగా పెరిగి పెద్ద‌వాళ్ల‌యిపోతున్నారు. వీరిద్దరికి సంబంధించిన విశేషాలను బన్నీ - స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. జూనియర్ స్టైలిష్ స్టార్ ఆల్ రౌండర్ అని మనకు అతను చేసే పనులతో తెలిసేలా చేసాడు. ఇంతక ముందు ఓ మై గాడ్ డాడీ పాటలో చెల్లి ఆర్హతో కలిసి బాగానే సందడి చేశాడు. ఇక అర్హ ఇటీవల 'బుట్టబొమ్మ' పాటకి లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నిన్న అయాన్ చెఫ్ అవతారమెత్తి సలాడ్ తయారు చేశాడు. ఈ వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అయింది.

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ తన అన్నల పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. తన పెద్దన్న బాబీ కూతురు మరియు బన్నీ పిల్లలు అయాన్ - అర్హ లతో కలిసి స్టెప్పులేశాడు శిరీష్. ఈ వీడియోని స్నేహా రెడ్డి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ''ఫన్ విత్ శిరి బాబాయ్'' అని కామెంట్ పెట్టింది. దీంట్లో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ కి పోటీగా స్టెప్స్ వేయడం కనిపిస్తోంది. బన్నీ కొడుకు ఎంత ఎనర్జీగా కనిపిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్ తో మరోసారి గుర్తు చేసాడు. ఇక అర్హ అయితే తన క్యూట్ డ్యాన్స్ తో అలరిస్తోంది. ఈ పిల్లల డ్యాన్స్ చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.