Begin typing your search above and press return to search.
రాజమౌళితో సినిమా కూడా అడగలేదట
By: Tupaki Desk | 13 Aug 2016 5:30 PM GMTపాపం మీడియావాళ్ళు అల్లు శిరీష్ ను ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. మనోడు తన ట్విట్టర్ సాక్షిగా ఎన్నేసి సంజాయిషీలు ఇచ్చినా కూడా.. వాళ్లు మాత్రం తమకు తోచిందే రాసేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు శిరీష్.
తాను బాహుబలి సినిమా గురించి అసలు ప్రస్తావించలేదని చెప్పిన శిరీష్.. ఇప్పుడు మరోసారి ఇదే విషయంపై క్లారిటీ చెప్పే ప్రయత్న చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనోడు రాజమౌళి డైరక్షన్లో ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు అంటున్నాడు శిరీష్. అసలు బెంగుళూరుతో తను మీడియాతో ఏం మాట్లాడాడో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
శిరీష్ స్టేట్మెంట్ ఏంటంటే.. ''నన్ను ఆ విలేఖరి ఏమని అడిగారంటే.. మీరు మాస్ సినిమాలు చేస్తారా అన్నారు. 'అబ్బే లేదు.. నేను లవ్ కమ్ రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నా. బాగా మెట్యూరిటీ వస్తే కాని మాస్ సినిమాలను చేయలేం' అని చెప్పాను. అప్పుడు ఆ విలేఖరి ఏమన్నారంటే.. 'మరి రాజమౌళి వంటి దర్శకుడు మీకు సినిమాను ఆఫర్ చేస్తే?' అని అడిగారు. 'అలాంటి పెద్ద దర్శకుడు నిజంగా నేను మాస్ సినిమాలకు ఫిట్ అవుతాను అనుకుంటే.. ఖచ్చితంగా సినిమా చేస్తాను' అని చెప్పాను'' అంటూ క్లారిటీ ఇచ్చాడు శిరీష్.
సో.. రాజమౌళి డైరక్షన్లో సినిమా చేయాలని మనోడు ఆశించట్లేదు. ఒకవేళ వస్తే కాదనడు. అది సంగతి.. విత్ ఫుల్ క్లారిటీ!!