Begin typing your search above and press return to search.
ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్ బ్రేకప్ సాంగ్.. 'మాయారే'..!
By: Tupaki Desk | 17 Oct 2022 5:37 PM GMTవైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న యువ హీరో అల్లు శిరీష్.. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు "ఊర్వశివో రాక్షసివో" చిత్రంతో పలకరించబోతున్నాడు. ఇందులో అందాల భామ అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే డేట్ ని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
'ఊర్వశివో రాక్షసివో' సినిమా నుంచి ఇప్పటికే 'దీంతననా' అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అచ్చు రాజమణి సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మాయారే' అనే సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 'పోరీల యెంటా పోకు ఫ్రెండూ.. ఆడుకుంటారు నిన్ను రౌండూ..' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
పడిపోకురా ఇస్తే స్మైలు... బతుకు అయితది గూడ్సు రైలు అంటూ అమ్మాయిలు చేసేదంతా చేసేసి జారుకుంటారని.. అమ్మాయిలంతా మాయని.. వాళ్ళతో పెట్టుకుంటే గాయాలు తప్పవని అల్లు శిరీష్ హిత బోధ చేస్తున్నారు. అతను తన బ్రేకప్ బాధను చెప్పుకుంటూ.. అబ్బాయిలందరికీ లెక్చర్ ఇస్తున్నాడు. ఈ బ్రేకప్ సాంగ్ లో శిరీష్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి విజయ్ కొరియోగ్రఫీ చేశారు.
'మాయారే' పాటకు అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేసారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ లవ్ లో ఫెయిల్ అయిన యువకుల భావాలకు సరిపోయే విధంగా లిరిక్స్ అందించారు. 'బిగ్ బాస్' ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో ఈ గీతాన్ని ఆలపించాడు. ఇప్పటి వరకూ వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో' ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా.. లేటెస్టుగా వచ్చిన సాంగ్ కూడా అనూహ్య స్పందన తెచ్చుకుంటోంది.
'విజేత' ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. తన్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. బాబు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే సరికొత్త కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "ఊర్వశివో రాక్షసివో" సినిమా తెరకెక్కింది. ఇందులో అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. పోసాని కృష్ణ మురళి - వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2022 నవంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
'భలే భలే మగాడివోయ్' 'గీత గోవిందం' 'టాక్సీవాలా' 'ప్రతిరోజు పండగే' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న "ఊర్వశివో రాక్షసివో" సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అల్లు శిరీష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.