Begin typing your search above and press return to search.

అన్న కేరళపైన.. తమ్మడు కర్ణాటకపైన

By:  Tupaki Desk   |   9 Nov 2017 7:28 AM GMT
అన్న కేరళపైన.. తమ్మడు కర్ణాటకపైన
X
టాలీవుడ్ లో కొంత మంది హీరోలు పరభాషా ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నారనే చెప్పాలి. కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన హీరోలు కూడా అదే తరహాలో ఇతర భాషల్లో మార్కెట్ ని అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కేరళలో స్టార్ ఇమేజ్ ను సందించుకున్నాడు. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ డబ్ అవుతూ మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటున్నాయి.

అక్కడ ప్రేక్షకులు అల్లు అర్జున్ ని మల్లు స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారంటే చెప్పవచ్చు బన్నీ ఎంతగా పాపులర్ అవుతున్నాడో. అయితే రీసెంట్ గా బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కూడా పరభాషా ప్రేక్షకుల మనసును గెలుచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. కర్ణాటకలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడి ప్రజలు ఎక్కువగా తెలుగు సినిమాల్లో యాక్షన్ సీన్స్ చాలా బాగా ఇష్టపడతారు.

అయితే రీసెంట్ గా అల్లు శిరీష్ కన్నడలో రిలీజ్ అవ్వబోతున్న తగరు అనే ఓ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకి వెళ్లాడు. అక్కడ స్పెషల్ గెస్ట్ గా రావడంతో అల్లు శిరీష్ కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అంతే కాకూండా అక్కడి వేడుకలో ఈ యువ హీరో కొన్ని స్టెప్పులు కూడా వేశాడు. దీన్ని బట్టి చూస్తే అన్నయ్య లానే తమ్ముడు కూడా అక్కడ ప్రేక్షకులను చాలా ఆకర్షిస్తున్నాడని తెలుస్తోంది. మరి నెక్స్ట్ సినిమాను అక్కడ ఏ స్థాయిలో రిలీజ్ చేస్తాడో చూడాలి