Begin typing your search above and press return to search.

మెగా కాంపౌండ్ నుండి ఇదే లాస్ట్

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:12 AM GMT
మెగా కాంపౌండ్ నుండి ఇదే లాస్ట్
X
ముందుగా అనుకున్నట్లుగానే సమ్మర్ సీజన్ ని మెగాహీరోలు బాగానే ఉపయోగించుకున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా.. రిలీజ్ లలో మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. మొదట సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్, ఆ తర్వాత సరైనోడుతో అల్లు అర్జున్ - నెక్ట్స్ సుప్రీం అంటూ సాయిధరం తేజ్ వచ్చేశారు. ఇక.. మెగా డాటర్ నీహారిక అరంగేట్ర మూవీ ఒక మనసుకుకి కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. వీటన్నిటి కంటే ముందే రెడీ అయి.. రిలీజ్ కి వెయింట్ చేస్తున్న మెగా కాంపౌండ్ మూవీ మరొకటి ఉంది.

శ్రీరస్తు శుభమస్తు అంటూ.. అల్లు శిరీష్ ఓ సినిమా చేశాడు. సోలో ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్. మొదటి సినిమా నుంచి నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న శిరీష్.. రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు. కొన్ని నెలలుగా ఈ మూవీ సంగతులు బయటకు రాకపోవడంతో.. ప్రాజెక్ట్ సంగతి తెలియలేదు.

ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ టీజర్ ను త్వరలో విడుదల కానుందంటూ.. కొత్త జంట హీరో అల్లు శిరీష్ కొత్త కబురు చెప్పాడు. తమ కాంపౌండ్ నుంచి వచ్చిన అందరినీ ఆదరించిన మెగా ఫ్యాన్స్.. తనను కూడా నిలబెడతారని భారీగానే ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో. మరి ఈ మెగా ఫ్యామిలీ హీరో ముచ్చటను మూడోసారైనా మెగా ఫ్యాన్స్ తీరుస్తారో.. లేదో!