Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ మంచి ఛాన్స్ మిస్సయ్యాడే..
By: Tupaki Desk | 5 April 2017 11:16 AM GMTఈసారి సమ్మర్ సినిమాల సందడి ఓ రేంజిలో ఉంటుందని ఆశించారు. కానీ ఆ ఆశలు ఆరంభంలోనే ఆవిరయ్యాయి. ‘కాటమరాయుడు’ అంచనాల్ని అందుకోవడం విఫలమైంది. ఆ సినిమా డిజాస్టర్ దిశగా సాగుతోంది. తర్వాతి వారం వచ్చిన ‘గురు’ మంచి టాక్ తెచ్చుకుని.. ‘ఎ’ సెంటర్లలో మంచి వసూళ్లే సాధిస్తోంది కానీ.. మాస్ ఏరియాల్లో అంతగా ప్రభావం చూపట్లేదు. మరోవైపు ‘దువ్వాడ జగన్నాథం’ సమ్మర్ రేసు నుంచి తప్పుకోవడమూ నిరాశ కలిగించే విషయమే. మొత్తంగా ఒక్క ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీదే అందరి ఆశలూ నిలిచి ఉన్నాయి. ఆ లోపు ఓ మోస్తరు సినిమాలే ఉన్నాయి బాక్సాఫీస్ రేసులో. ఇలాంటి టైంలో అల్లు శిరీష్ మంచి అడ్వాంటేజీని మిస్సయ్యాడు.
శిరీష్ మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ‘1971 బియాండ్ బోర్డర్స్’ సినిమా ఈ నెల 7న మలయాళంలో మంచి అంచనాల మధ్య రిలీజవుతుంది. ఈ చిత్రాన్ని ముందు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో మనసు మార్చుకున్నారు. ఒక్క మలయాళంలో మాత్రమే రిలీజవుతోంది. ఈ నెల 7న తెలుగులో ఒక్క ‘చెలియా’ సినిమా మాత్రమే రిలీజవుతోంది. దాని మీద మరీ హైప్ ఏమీ లేదు. జనతా గ్యారేజ్.. మన్యం పులి లాంటి సినిమాలతో మోహన్ లాల్ కు తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ‘1971’ టీజర్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పెద్దగా పోటీ లేని ఈ వారాంతంలో సినిమాను రిలీజ్ చేసుకుంటే కలిసొచ్చేది. కానీ ఆ అడ్వాంటేజీని మిస్సయ్యారు. మళ్లీ సరైన డేట్ దొరకాలంటే కష్టం. ఈ నెలలో ఛాన్సే లేదు. మేలో కూడా బెర్తులు బుక్ అయిపోయాయి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/