Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు బర్త్ డే విషెస్ అందించిన చిరంజీవి - మహేష్ - అల్లు శిరీష్..!

By:  Tupaki Desk   |   24 July 2021 7:30 AM GMT
కేటీఆర్ కు బర్త్ డే విషెస్ అందించిన చిరంజీవి - మహేష్ - అల్లు శిరీష్..!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. నేడు (జులై 24) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కేటీఆర్.. సినీ పరిశ్రమలోని ప్రముఖులతో సాన్నిహిత్యం కలిగివుంటారనే సంగతి తెలిసిందే. నేడు కేటీఆర్ బర్త్ డే కావడంతో రాజకీయ నాయకులతో పాటు సినీ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కేటీఆర్ ఇప్పటికే తన పుట్టినరోజు వేడుకలకు రావద్దని పిలుపునిస్తూ.. ఎక్కడి వారు అక్కడే తమకు తోచిన విధంగా సహాయం చేయాలని అభిమానులను కోరారు. అలానే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్‌ 'ముక్కోటి వృక్షార్చన' 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌'
పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సీనీ ప్రముఖులు మొక్కలు నాటి తెలంగాణ మంత్రికి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా కేటిఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు మొక్క‌లు నాటిన అల్లు శిరీష్.. కేటీఆర్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రికి విషెస్ అందించారు. ''మంచి స్నేహితుడు, నిజంగా గొప్ప నాయకుడు అయిన కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు! ఇన్క్రెడిబుల్ ఏడాది కోసం ముందుకు సాగండి" అని మహేష్ ట్వీట్ చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ కు విషెస్ అందించారు. ''హ్యాపీ బర్త్ డే కేటీఆర్‌. ఈ సందర్భంగా మరియు ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి. దీని ద్వారా రోజురోజుకూ పెరిగిపోతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ ను స్టాప్ చేద్దాం. మనం ప్రకృతిని రక్షిస్తే.. అది మన్నలి కాపాడుతుంది. ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు కృతజ్ఞతలు'' అని చిరు ట్వీట్ లో పేర్కొన్నారు. రవితేజ - సోనూసూద్ - శర్వానంద్ - సందీప్ కిషన్ - అనిల్ రావిపూడి వంటి వారు కూడా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.