Begin typing your search above and press return to search.
కొత్త అపార్ట్ మెంట్ కి షిఫ్టయిన స్టార్ హీరో బ్రదర్!
By: Tupaki Desk | 6 May 2020 12:27 PM ISTఅల్లు బ్రదర్స్ బన్ని-శిరీష్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. బన్ని స్టార్ హీరోగా పరిశ్రమలో చక్రం తిప్పుతుంటే బ్రదర్ శిరీష్ మాత్రం హీరోగా ఆశించినంతగా రాణించేకపోయాడు. కెరీర్ లో వరుసగా ఫ్లాపులు ఇబ్బందికరంగా మారాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తనవంతు ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు.
శిరీష్ తదుపరి వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తదుపరి సినిమాని ప్రకటించేందుకు ఇటీవల రెడీ అయ్యారని ప్రచారమైంది. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ఆ ప్రాజెక్టు వివరాలు వెల్లడి కాలేదు. ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పటికే డాడీ ఇంట్లో ఉంటున్నా కానీ సొంత ఇంటికి షిఫ్టయ్యే యోచనలో ఉన్నారు. తనకంటూ సపరేట్ విల్లా కావాలని కలలు గని ప్రస్తుతం సొంత ఇంటిని నిర్మిస్తున్నారు.
అయితే శిరీష్ మాటేమిటి? అంటే .. బ్యాచిలర్ అయిన తాను కూడా ఓ కొత్త అపార్ట్ మెంట్ లోకి షిఫ్టయ్యాడట. అక్కడ అయితే తనకు ప్రైవసీ ఉంటుందని భావించి వెళ్లాడట. జూబ్లీహిల్స్ లో అల్లు అరవింద్ ఇల్లు ఉంది. ఇక ఆ ఇంట్లో బన్ని అతడి ఫ్యామిలీ ఉంటున్నారు. శిరీష్ అలికిడి ఇకపై అక్కడ ఉండదట. ప్రస్తుత సన్నివేశంలో శిరీష్ నిర్మాతగా ఎదిగే ఆలోచన చేస్తున్నారు. తదుపరి వరుసగా తండ్రి బాటలోనే సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉన్నారట. మరోవైపు ఆహా ఓటీటీ-డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారం అభివృద్ధి చేసేందుకు అరవింద్ తో పాటు శిరీష్ ఎంతో శ్రమిస్తున్నారన్న సమాచారం ఉంది. త్వరలోనే తాను హీరోగా నటించే సినిమా వివరాల్ని వెల్లడించనున్నారని తెలుస్తోంది.