Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:40 AM GMT
అల్లు శిరీష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువ హీరో శిరీష్.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డాడు. అల్లువారబ్బాయి తన ఏడేళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ 6 చిత్రాలు మాత్రమే చేసాడు.

'గౌరవం' అనే కంటెంట్ బేస్డ్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన శిరీష్.. ఆ తర్వాత 'కొత్త జంట' 'శ్రీరస్తు శుభమస్తు' '1971' 'ఒక్క క్షణం' 'ఏబీసీడీ' వంటి చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా వేటికవే ప్రత్యేకంగా నిలిచే విభిన్నమైన జోనర్స్ సినిమాలే కావడం విశేషం.

కమర్షియాలిటీ వైపు పరుగులు తీయకుండా.. కంటెంట్ ను నమ్ముకొని సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే శిరీష్ నుంచి 'ఏబీసీడీ' తర్వాత మరో సినిమా రాలేదు. మధ్యలో 'విలాయతి శరాబ్‌' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

అల్లు శిరీష్ ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి గ్రౌండ్ వర్క్‌ ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు ప్రముఖ దర్శకులతో స్క్రిప్ట్ డిస్కషన్స్‌ లో కూడా పాల్గొంటున్నాడని సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే, అల్లు శిరీష్ తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌ లో హీరోగా నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే శిరీష్ కొత్త సినిమా 2022 నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా టైటిల్ - ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ తో పాటు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అల్లు శిరీష్ కొత్త సినిమా విడుదల వార్తలపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. తమ హీరో మంచి సినిమాతో బిగ్ స్క్రీన్స్ మీదకు తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.