Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ మూవీలో అన్ని లిప్ లాక్ లా?

By:  Tupaki Desk   |   30 Oct 2022 2:30 AM GMT
అల్లు శిరీష్ మూవీలో అన్ని లిప్ లాక్ లా?
X
అల్లు శిరీష్ దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత న‌టించిన‌ రొమాంటిక్ 'మూవీ 'ఊర్వ‌శివో రాక్ష‌సివో'. రాకేష్ శశి తెర‌కెక్కించాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. త‌మిళంలో 'జెర్సీ' ఫేమ్ హ‌రీష్ క‌ల్యాణ్‌, రైజా విల్స‌న్‌జంట‌గా న‌టించిన 'ప్యార్ ప్రేమ కాద‌ల్‌' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు.

జీఏ2 పిక్చ‌ర్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ధీర‌జ్ మొగిలినేని నిర్మించారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీని న‌వంబ‌ర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. రీసెంట్ గా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని కూడా ప్రారంభించేశారు. టీజ‌ర్ లో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ల మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ ,ఇద్ద‌రి మ‌ధ్య చిత్రీక‌రించిన హాట్ రొమాంటిక్ సీన్స్‌, లిప్ లాక్ స‌న్నివేశాలు యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమా పూర్తిగా యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన‌ట్టుగా టీజ‌ర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఈ ఆదివారం నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసింది. సినిమా ఫ‌స్ట్ హాఫ్ చిలిపి అల్ల‌రి, తగాదాలు.. మొతాదుకు మించిన రొమాంటిక్ స‌న్నివేశాల‌తో సాగుతుందట‌.

ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోష‌న్స్ తో సాగుతుంద‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది.

టీజ‌ర్ లో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ లిప్ లాక్ ల‌తో రెచ్చిపోయిన తీరు షాక్ కు గురిచేసిన విష‌యం తెలిసిందే. కేవ‌లః ఒక లిప్ లాక్ చూసే ఇలా అయిపోతే సినిమాలో ఏకంగా పద‌హారు లిప్ లాక్ లు వున్నాయ‌ట అవి చూసి ఇంకేమంటారో.. ఎలాంటి షాక్ గుర‌వుతారో అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ప‌ద‌హారు లిప్ లాక్ ల‌లో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ఎలా న‌టించారో.. ఏ స్థాయిలో షాక్ ఇడ్డ‌బోతున్నారో తెలియాలంటే న‌వంబ‌ర్‌4 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.