Begin typing your search above and press return to search.
అల్లు వారు వైజాగ్ స్టూడియో ప్లాన్ డ్రాపయ్యారా?
By: Tupaki Desk | 4 Jan 2021 3:45 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - అల్లు అరవింద్ ద్వయం హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో సొంత సినీ స్టూడియో నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసినదే. ఇటీవలే భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టారు. అయితే ఇదే జోడీ ఏపీ- తెలంగాణ డివైడ్ తర్వాత బీచ్ సొగసుల వైజాగ్ లో సినీస్టూడియోని నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారని అందుకు మెగాస్టార్ చిరంజీవి.. గంటా శ్రీనివాసరావు వంటి వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం సాగింది.
కానీ అనూహ్యంగా ఇప్పుడు బన్ని ప్లాన్ మారింది. హైదరాబాద్ వరకే స్టూడియో ఆలోచనల్ని పరిమితం చేయడం ఏపీ-వైజాగ్ ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది. తాజాగా `ఆహా` ఇంటర్వ్యూలో బన్ని ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే .. హైదరాబాద్ లో స్టూడియో నిర్మించాలన్న పుషింగ్ తనదేనని అర్థమవుతోంది.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లినప్పుడు మరొకరి స్టూడియోలో నేనెందుకు సినిమాలు చెయ్యాలి అనే ఫీల్ కలిగిందట. అందుకే అక్కడికక్కడే సొంత స్టూడియోకు ప్లాన్ చేశానని చెప్పారు బన్ని. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణం మొదలెట్టేశారన్నమాట. అన్నట్టు ఏపీలో సినీస్టూడియోల నిర్మాణానికి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నివిధాలా సినీపరిశ్రమకు సహకరిస్తానని అన్నారు. మరి బన్నీ- అరవింద్ జోడీకి అక్కడ కూడా ఒక స్టూడియోని నిర్మించే ఆలోచన ఉందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జస్ట్ బిగినింగ్.. అంటూ అల రిజల్ట్ పై స్పందిస్తూ మునుముందు ఇంకా పెద్ద విజయాలు అందుకుంటానన్న ధీమాను కనబరిచారు. ప్రస్తుతం ప్రభాస్ తరహాలోనే అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినదే.