Begin typing your search above and press return to search.

#నిహారిక పెళ్లి.. స్పెష‌ల్ విమానంలో అల్లు వారి స్టైల్

By:  Tupaki Desk   |   10 Dec 2020 12:49 PM GMT
#నిహారిక పెళ్లి.. స్పెష‌ల్ విమానంలో అల్లు వారి స్టైల్
X
ఇది అల్లు వారి స్టైల్ స్టేట్ మెంట్. చూస్తుంటేనే అర్థ‌మవుతోంది క‌దా.. అల్లు ఫ్యామిలీ ఎంతో ఠీవిగా స్పెష‌ల్ జెట్ లో తిరుగు ప్ర‌యాణం అయ్యార‌ని . నిహారిక కొణిదెల రెండు రోజుల డెస్టినేష్ వెడ్డింగ్ వేడుక ముగిశాక ఇదిగో ఇలా తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

ఈ పెళ్లి కోసం ప్ర‌త్యేకించి మెగా అల్లు ఫ్యామిలీ స‌భ్యులంతా ప్ర‌త్యేక విమానాల్లో రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లోని వెన్యూకి చేరుకున్నారు. పెళ్లి వేడుక‌లో బోలెడంత సంద‌డి చేసిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

అల్లు త్రిమూర్తులు బాబి-అర్జున్- శిరీష్ ఫోటోలు ఇంత‌కుముందు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. బ‌న్ని-స్నేహారెడ్డి జంట కిడ్స్ తో క‌లిసి ఈ వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇప్పుడు తిరుగుప్ర‌యాణంలోనూ ఇలా క‌లిసే వెళుతున్నారు. బాస్ అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి స‌మేతంగా విమానంలో సీట్ల‌లో కూర్చున్నారు. బ‌న్ని-స్నేహ దంప‌తులు.. బాబి త‌దిత‌ర బృందం ఈ విమానంలో ఉన్నారు. బ‌న్ని టోట‌ల్ బ్లాక్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తుండ‌గా.. బాబి కూడా అంతే స్టైలిష్ గా రెబాన్ తో క‌నిపించారు. బ‌న్ని ఈ ప్ర‌యాణం అనంత‌రం పుష్ప సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది.