Begin typing your search above and press return to search.

పార్టీ ఇచ్చి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేశారా?

By:  Tupaki Desk   |   4 Oct 2019 7:37 AM GMT
పార్టీ ఇచ్చి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేశారా?
X
'సైరా న‌ర‌సింహారెడ్డి' ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాలు ఇప్ప‌టికే హీట్ పెంచాయి. రిలీజ్ చేసిన ప్ర‌తీ చోట సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డం .. దీనికి అద‌నంగా పంగ‌డ సీజ‌న్ కావ‌డం క‌లిసొస్తోంది. మౌత్ ప‌బ్లిసిటీలో వ‌సూళ్లు మ‌రిత‌గా పెరిగే అవ‌కాశం వుండ‌టంతో మెగా క్యాంప్ మంచి జోరుమీదుంది. ఊహించిన దానికి మించి సినిమాకు విజయం ద‌క్క‌డంతో మెగా క్యాంప్ అంతా సెల‌బ్రేష‌న్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ అవ‌కాశాన్ని అల్లూస్ ఏమాత్రం మిస్ చేసుకోలేదు మ‌రి. గ‌త కొంత కాలంగా స‌క్సెస్ అయిన సినిమా తీస్తే ఆ టీమ్ ని పిలిచి స‌త‌క్క‌రించి పార్టీలు చేయ‌డం అనే చ‌క్క‌ని క‌ల్చ‌ర్ ని అల్లూస్ ఆన‌వాయితీగా పెట్టుకున్నారు.

అంద‌రినీ పిలిచి స‌క్సెస్‌ పార్టీ ఇచ్చి మ‌రీ ఎంజాయ్ చేస్తున్న అల్లూ క్యాంప్‌.. అదే క్ర‌మంలో మెగా బాస్ చిరంజీవికి 'సైరా' స‌క్సెస్ పార్టీ ని ఇచ్చారు. గురువారం రాత్రి 'సైరా' టీమ్ అల్లు అర‌వింద్ ఇంట్లో జ‌రిగిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీకి చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

అయితే ఈ పార్టీ అంద‌రికి ఇచ్చిన‌ట్టే చిరుకు ఇచ్చారా? ఏంటీ క‌థ‌? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ క‌నిపించ‌క‌పోవ‌డంతో .. మెగా క్యాంప్ కి అల్లు అర్జున్ దూరంగా వుంటున్నాడ‌ని ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు చేశారు. దానికి తోడు అల్లు అర్జున్ సిటీలోనే వున్నా మెగా ఈవెంట్ కి ముఖం చాటేశాడ‌ని విమ‌ర్శించారు. దీంతో ఆ విమ‌ర్శ‌ల‌న్నింటికీ చెక్ పెట్టాల‌నే అల్లూ వారు 'సైరా' పార్టీ ఇచ్చారా అన్న ముచ్చ‌టా సాగుతోంది.

పార్టీ అతిధుల వివ‌రాలు ఆస‌క్తిక‌రం. చిరంజీవి- సురేఖ దంప‌తులు ..అల్లు అర‌వింద్‌ ..రామ్‌చ‌ర‌ణ్ .. అల్లు అర్జున్‌.. వ‌రుణ్‌తేజ్‌... సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలా మెగా -అల్లూ పార్టీ అదిరింది. ఇందులోనే అఖిల్ అక్కినేని- ర‌త్న‌వేలు- శ్రీ‌కాంత్‌- చిరు పెద్ద కూతురు సుష్మిత‌- ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్- బుర్రా సాయి మాధ‌వ్‌- ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు- అల్లు శిరీష్‌- సురేంద‌ర్‌రెడ్డి- దిల్ రాజు- హ‌రీష్‌శంక‌ర్‌- యూవీ వంశీ- విక్ర‌మ్‌- వాసువ‌ర్మ‌- మెహ‌ర్ ర‌మేష్‌- డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు, కె.ఎస్‌. రామారావు, జెమిని కిర‌ణ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.