Begin typing your search above and press return to search.

పిక్ టాక్: సరదా సాయంత్రం.. ఒక్కచోట చేరిన 'అల్లు' ఫ్యామిలీ..!

By:  Tupaki Desk   |   15 Oct 2022 11:34 AM GMT
పిక్ టాక్: సరదా సాయంత్రం.. ఒక్కచోట చేరిన అల్లు ఫ్యామిలీ..!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మిగతా కుటుంబ సభ్యులు అంతా.. ఇప్పుడు ఇండస్ట్రీలో 'అల్లు' బ్రాండ్ ని నిలబెట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య వేసిన బాటలో పయనిస్తూ.. టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న అల్లు ఫ్యామిలీ అంతా.. ఇటీవల తమ ఇంటి గార్డెన్ లో హాయిగా గడుపుతున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అల్లు అరవింద్ - నిర్మల దంపతులతో పాటుగా.. బన్నీ - స్నేహరెడ్డి మరియు ఇద్దరు పిల్లలు అయాన్ - అర్హ ఉన్నారు.

అలానే అల్లు బాబీ దంపతులు మరియు వారి పిల్లలు - అల్లు శిరీష్ ను కూడా ఈ ఫొటోలో చూడొచ్చు. ఇక్కడ కుటుంబ పెద్ద అల్లు అరవింద్ - బాబీ ఏదో వివరించడానికి ప్రయత్నిస్తుండగా.. ఇతర కుటుంబ సభ్యులు శ్రద్ధగా వింటున్నారు.

సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారో లేదా కుటుంబ విషయాలపైన చర్చలు జరుపుతున్నారో తెలియదు కానీ.. అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కచోట చేరి ఆ సాయంత్రాన్ని సరదగా గడుపుతున్నారని తెలుస్తోంది. 'అల్లు' చిల్ అవుట్ ఈవెనింగ్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, అల్లు రామలింగయ్య కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అరవింద్‌.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు ఓటీటీ రంగంలో అడుగుపెట్టారు. పలు ప్రాంతీయ భాషల్లో 'ఆహా' అనే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

మరోవైపు అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని ఆయన మనవళ్లు అల్లు అర్జున్ మరియు శిరీష్‌ కొనసాగిస్తున్నారు. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన బన్నీ.. ఆ ఇమేజ్ ను కాపాడుకునే విధంగా ప్లాన్స్ వేస్తున్నారు. శిరీష్ సైతం వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక అల్లు బాబీ (వెంకటేష్) కూడా నిర్మాతగా మారి ప్రొడక్షన్ లోకి దిగారు.

అల్లు కుటుంబం నుంచి ఇప్పటి వరకూ మూడు తరాల వారు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుండగా.. మరికొన్ని నాలుగో తరం వారసురాలు అర్హ కూడా తెరంగేట్రం చేయబోతోంది. 'శాకుంతలం' సినిమాలో ఈ చిన్నారి లిటిల్ భరతగా కనిపించనుంది. రాబోయే రోజుల్లో అల్లు అయాన్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ సినిమాలు మరియు ఓటీటీ రంగంలో తమదైన ముద్ర వేసుకున్న అల్లు ఫ్యామిలీ.. ఇప్పుడు స్టూడియో వ్యాపారంలో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా 'అల్లు స్టూడియోస్' నిర్మాణం చేపట్టారు.

అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల అల్లు ఇంటి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినీ స్టూడియోస్‌ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి.

హోమ్ బ్యానర్ లో శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా నవంబర్ 4న విడుదల కాబోతోంది. అలానే అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నద్ధం అవుతున్నారు. దీపావళి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.