Begin typing your search above and press return to search.

అల్లు వ‌ర్సెస్ అల్లు.. ఇస్ట‌యిల్ అదిరెనులే!

By:  Tupaki Desk   |   25 Feb 2021 10:30 AM GMT
అల్లు వ‌ర్సెస్ అల్లు.. ఇస్ట‌యిల్ అదిరెనులే!
X
ప‌రిశ్ర‌మ‌లో అల్లు వారి సంద‌డి లేనిదే ఏదీ లేదు. ఇంత‌కుముందు నిహారిక వెడ్డింగ్ లో అల్లు వారి సంద‌డే సంద‌డి. అందుకు సంబంధించిన ఫోటోలు ఆల్బ‌మ్ కే హైలైట్ అయ్యాయి. అల్లు బ్ర‌ద‌ర్స్ ముగ్గురూ ఆ పెళ్లిలో రౌండ్ టేబుల్ కాన్ఫ‌రెన్స్ పెట్టుకున్న ఫోటోలు అభిమానుల్లో హ‌ల్ చ‌ల్ చేశాయి. మెగాస్టార్ ఇంట ఏ వేడుక జ‌రిగినా అక్క‌డ వీరంతా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. ఎంతో సంద‌డి చేస్తారు.

ఇప్పుడు సుకుమార్ కుమార్తె ఈవెంట్లో కూడా అల్లు వారి సంద‌డి మామూలుగా లేదు. అక్క‌డ వైట్ అండ్ బ్లాక్ లో ఎంట్రీ ఇచ్చిన అల్లూస్ కార్పొరెట్ స్టైల్లో అద‌ర‌గొట్టారు. డాడీతో క‌లిసే అల్లు బ్ర‌ద‌ర్స్ స్టైలిష్ గా దిగారు.

బాస్ అల్లు అర‌వింద్ ప‌క్కా జెంటిల్ మ‌న్ లా క‌నిపిస్తుంటే.. ఆ ప‌క్క‌నే అల్లు బాబి ఎంతో స్టైలిష్ గా కెమెరాల‌కు ఫోజులిచ్చారు. అత‌డు వైట్ కుర్తా బ్లాక్ జీన్స్ లో ఇచ్చిన ఫోజు ఎక్స్ ప్రెష‌న్ ఆక‌ట్టుకున్నాయి. అలాగే అల్లు శిరీష్ అంతే ఇస్మార్ట్ గా క‌నిపించారు ఫార్మ‌ల్ లుక్ లో. అయితే బ‌న్నీనే ఈ ఫ్రేమ్ లో మిస్స‌యిన‌ట్టున్నారు. అల్లు అర్జున్ త‌న ఫ్రెండు సుక్కూతో లోన ప‌రాచికాల్లో ఉండిపోవడంతో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చిక్కిన‌ట్టు లేరు. అల్లు బాస్ అర‌వింద్ త‌న స‌తీమ‌ణి తోనే ఈ వేడుక‌కు ఎటెండ‌య్యారు.

ఇక సుకుమార్ అల్లు ఫ్యామిలీలో ఒక మెంబ‌ర్ అంటే అతిశ‌యోక్తి కాదు. ఆర్య సినిమాతో బ‌న్ని రేంజును అమాంతం పెంచేసిన సుక్కూ అంటే ఆ కాంపౌండ్ కి ప్ర‌త్యేక ప్రేమాభిమానాలు.. అంత‌కుమించి గౌర‌వం కూడా. అందుకే ఈ ఈవెంట్లో ఆ ఫ్యామిలీ మెంబ‌ర్ ఎవ‌రూ మిస్స‌వ్వ‌నేలేదు. ప్ర‌స్తుతం ఆర్య సుక్కూ బ‌న్నీతో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.