Begin typing your search above and press return to search.
అల్లు బ్రదర్స్ ఎక్కడా రౌండ్ టేబుల్ సమావేశం?
By: Tupaki Desk | 8 Dec 2020 12:26 PM ISTఅల్లు అరవింద్ వారసులు అల్లు బ్రదర్స్ గురించి పరిచయం అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు. వీరిని త్రిమూర్తుల అనొచ్చు. తమ్ముడు శిరీష్ ఇప్పటికే హీరోగా సుపరిచితం. అల్ల శిరీస్ కి కొంత గ్యాప్ వచ్చినా స్టార్ గా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే ఆపలేదు. ఆహా-తెలుగు అభివృద్ధి కోసం డాడ్ అరవింద్ తో కలిసి శిరీష్ కృషి చేస్తున్నారు.
ఇక అన్నగారు అల్లు బాబి (వెంకటేష్) ఇటీవల సోషల్ మీడియాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన హైదరాబాద్ కి చెందిన నీలా షా అనే ఫ్యాషనిస్టా కం యోగా గురూని రెండో వివాహం చేసుకున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
అరుదుగానే అల్లు బ్రదర్స్ ముగ్గురూ ఉండే ఫోటోఫ్రేమ్ లు బయటపడుతుంటాయి. పెళ్లిళ్లు ఫంక్షన్ల వేళ మాత్రమే అప్పుడప్పుడు సాధ్యం. ఇప్పుడు నిహారిక వెడ్డింగ్ లోనూ అల్లు బ్రదర్స్ సందడి మామూలుగా లేదు. ఆ ముగ్గురూ ఓచోట ఇలా సమావేశమై చిలౌట్ అవుతున్న ఫోటో అభిమానుల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అల్లు బ్రదర్స్ ఏమిటా రౌండ్ టేబుల్ చిట్ చాట్ అంటూ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. బ్లాక్ లో బాబి.. బ్లాక్ జర్కిన్ లో శిరీష్ వైట్ షేర్వాణీ డ్రెస్ లో ఉన్న బన్ని కి అటూ ఇటూ కూచుని నవ్వులు చిందిస్తున్నారు.
వెడ్డింగ్ వెన్యూ మ్యాటర్ కి వస్తే.. నిహారిక- చైతన్య జంట వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ భవంతిలో అత్యంత వైభవంగా జరగనుంది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఈ జంట వివాహం కోసం ఘనమైన ఏర్పాట్లు చేయగా ఇప్పటికే వెన్యూ వద్దకు అతిథులంతా చేరుకున్నారు. ప్రీవెడ్డింగ్.. సంగీత్ కార్యక్రమాల ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.