Begin typing your search above and press return to search.

ఫస్ట్ వైఫ్ గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు బాబీ

By:  Tupaki Desk   |   24 Jun 2019 11:11 AM IST
ఫస్ట్ వైఫ్ గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు బాబీ
X
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈమధ్యే రెండవ వివాహం చేసుకున్నారు. ఈ విషయం గురించి ముందే ఇన్ఫో ఉంటే ఎవరూ షాక్ అయి ఉండేవారు కాదు కానీ సడెన్ గా పెళ్ళి అనే న్యూస్ రావడంతో చాలామందికి షాక్ తగిలింది.. కొందరు సర్ ప్రైజ్ అయ్యారు. పైగా ఫోటోలలో బాబీ పెద్ద తమ్ముడు అల్లు అర్జున్ కనపడకపోవడంతో అది కూడా ఒక హాట్ టాపిక్ అయింది. అదంతా పక్కన పెట్టేస్తే బాబీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివాహం విషయం తెలుపుతూ.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించాడు.

బాబీ మొదట నీలిమ బండి అనే అమ్మయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ అన్విత అనే పాప కూడా ఉంది. ఆయితే బాబీ - నీలిమ ఇద్దరూ అభిప్రాయ భేదాల కారణంగా 2016 లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే పాప కోసం మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. అందుకే అల్లువారి కుంటుంబం లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నీలిమ కూడా హాజరవుతారట. ఈ విషయం గురించి బాబీ స్పందిస్తూ డైవోర్స్ తీసుకున్నప్పటికీ నీలిమ ఎప్పటికీ తమకు కుటుంబ సభ్యురాలు లాంటిదే అని స్పష్టం చేశాడు. తమకు అన్విత అనే అందమైన పాప ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశాడు.

దీంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నీలిమా అల్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎలా ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్న నెటిజన్లకు సూటిగా సమాధానం ఇచ్చినట్టయింది. విడాకులు అనగానే అదేదో ఈ ప్రపంచంలో ఎక్కడా జరగనట్టు.. తెగ ఇదైపోయేవారికి ఇంతకంటే ఎవరు క్లారిటీ ఇస్తారు? విడిపోయినప్పటికీ పిల్లలకోసం ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించడం అభినందించాల్సిన విషయమే.