Begin typing your search above and press return to search.

నాన్నగారి బాటలో అల్లు బాబీ

By:  Tupaki Desk   |   19 Dec 2018 5:30 PM GMT
నాన్నగారి బాటలో అల్లు బాబీ
X
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ ఒకరు. ఏ ప్రొడ్యూసర్ అయినా జెనరేషన్ మారినప్పుడు కొత్త ట్రెండ్ ను ను అందిపుచ్చుకోలేక వెనకబడడం కామనే. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ జెనరేషన్ యువదర్శకులు.. యువ హీరోలతో పనిచేస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ బాటలో అయన పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా మారుతున్నాడట.

బాబీ తన రిలేటివ్ సిద్ధూతో కలిసి ఒక సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. వరుణ్ తేజ్ హీరో గా నటించే ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడట. త్వరలో ఈ సినిమా కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అని సమాచారం. 'అంతరిక్షం'.. 'F2' ల తర్వాత వరుణ్ తేజ్ చేయబోయే చిత్రం ఇదేనట.

అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరో గా ఎదిగాడు. మూడో కుమారుడు శిరీష్ హీరో గా నిలదొక్కుకునే ప్రయత్నాలలో ఉన్నాడు. ఇప్పుడు పెద్దబ్బాయి నాన్నగారి బాటలో నిర్మాతగా తన లక్కును టెస్ట్ చేసుకోబోతున్నాడు. మరి అరవింద్ గారిలాగా నిర్మాణ రంగంలో తన ముద్ర వేస్తాడేమో వేచి చూడాలి..